మనం తీసుకునే ఆహారం, జీవనశైలి బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం బాగుండాలంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా ముఖ్యం. కానీ ఈ మధ్య కాలంలో పిల్లలు వాళ్ల యొక్క సమయాన్ని స్క్రీన్ల ముందు మాత్రమే గడుపుతున్నారు. ఫిజికల్ యాక్టివిటీకి బాగా దూరం అయిపోయారు. ఫిజికల్ యాక్టివిటీ బాగుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలానే మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. పీరియడ్స్ కూడా ఫిజికల్ యాక్టివిటీ పైన ఆధారపడి ఉంటాయని వైద్యులు అంటున్నారు. అయితే నెలసరి సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. కడుపునొప్పి, క్రామ్ప్స్, వికారం ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా సమస్య వస్తుంది.

Video Advertisement

 

కొందరిలో అయితే బ్లీడింగ్ నాలుగు రోజులకి ఆగిపోకుండా పది రోజుల వరకు అవుతూ ఉంటుంది. పైగా విపరీతంగా కడుపు నొప్పి చాలామందిలో ఉంటుంది. అయితే ఈ రోజు నెలసరి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పనులు చేయకూడదు అనేది మనం తెలుసుకుందాం.

నెలసరి సమయంలో శుభ్రత అనేది చాలా ముఖ్యం. ప్రతి ఆరు గంటలకి ఒకసారి ప్యాడ్స్ మార్చుకుంటూ ఉండాలి. అలానే వెజైనల్ ఆర్గాన్స్ ని శుభ్రంగా ఉంచుకోవాలి. అదే విధంగా నెలసరి సమయంలో ఎక్కువ ఉప్పగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది కాదు. దీని వలన బ్లోటింగ్ వంటి సమస్యలు వస్తాయి. అదే విధంగా ఎక్కువ మంచి నీళ్ళు తీసుకుంటూ ఉండాలి లేదు అంటే డీహైడ్రేషన్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.

అలానే ఒకవేళ మీ పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ చాలా తక్కువగా అవుతుంటే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి. పాలకూర వంటి ఆహారం ద్వారా మెగ్నీషియం అందుతుంది. అదే విధంగా స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి డయేరియా, కడుపునొప్పి వంటివి రాకుండా ఉండాలంటే స్పైసి గా ఉంటే ఆహార పదార్థాలు తీసుకోవద్దు. కడుపు నొప్పి బాగా ఉంటే హాట్ కంప్రెసర్ లేదా హాట్ వాటర్ బాటిల్స్ ను ఉపయోగిస్తే తక్షణ రిలీఫ్ ఉంటుంది.