Ads
ప్రతి ఒక్కరికి కూడా కొత్త సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించాలని ఉంటుంది. పైగా ఈ ఏడాది చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదని కూడా చాలా మంది భావిస్తూ ఉంటారు వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలని మంచిగా ఉండాలని చూస్తారు. కొంతమంది అయితే న్యూ ఇయర్ రిసల్యూషన్స్ ని పెట్టుకుంటారు. ఇలా కొత్త సంవత్సరానికి కొన్ని రూల్స్ ని పెట్టుకుని వాటిని ఫాలో అవుతూ ఉంటారు.
Video Advertisement
దాంతో జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోగలరు అని.. అయితే కొత్త సంవత్సరం మీరు వీటిని వదిలేసి ముందుకు వెళితే మీ భవిష్యత్తు మరింత అద్భుతంగా మారుతుంది పైగా ఉన్న సమయాన్ని వినియోగించుకుని మీరు అందమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి అవుతుంది. మరి కొత్త సంవత్సరం లో వేటిని పక్కన పెట్టేయాలి ఎటువంటి వాటికి దూరంగా ఉండాలి అనేది చూద్దాం.
#1. సోషల్ మీడియా కి దూరంగా ఉండండి:
చాలామంది ఎక్కువ సేపు సోషల్ మీడియాలో గడుపుతూ ఉంటారు. సోషల్ మీడియాకి దూరంగా ఉంటే మనకి సమయం మిగులుతుంది. మిగిలిన పనుల మీద ధ్యాస పెట్టొచ్చు.
#2. పదేపదే విరిగిపోయిన ఫీలింగ్స్ పై ఆలోచన వద్దు:
చాలామంది విడిపోయిన తర్వాత కూడా అవే ఫీలింగ్స్ ని పెట్టుకుని బాధపడుతూ ఉంటారు దీని వలన మీ జీవితం భారంగా ఉంటుంది తప్ప ఫలితం ఉండదు.
#3. నెగిటివ్ ఎనర్జీ:
నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరంగా ఉంచేసి పాజిటివ్ గా ఉండడానికి చూడండి మంచి దారిలో వెళితే కచ్చితంగా పైకి వెళ్లడానికి అవుతుంది.
#4. మల్టీ టాస్కింగ్:
ఒక్క పని మాత్రమే కాకుండా అన్ని పనుల మీద ధ్యాస పెట్టి సరైన టైంకి పూర్తి చేస్తూ ఉండండి.
#5. కంపేర్ చేసుకోవద్దు:
ఇతరులతో కంపేర్ చేసుకోవడం వలన జీవితంలో నష్టం కలుగుతుంది తప్ప ఎటువంటి లాభం ఉండదు.
#6. గతం గురించి ఆలోచించడం:
కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి పాత వాటిని పదే పదే తలుచుకోవడం ఆలోచించడం మంచిది కాదు వీలైనంత వరకు ముందుకు వెళ్లడానికి చూసుకోండి గడిచిన వాటిని ఎలాగో మార్చలేము.
End of Article