228
Ads
దేవాలయం భగవంతుని ఇల్లు. అక్కడ మనకు నచ్చినట్లు ప్రవర్తించకూడదు. అయితే చాలా మంది తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఇలా చేయడం వల్ల పుణ్యం లభించదు. అందరికీ సంబంధించింది దేవాలయం కనుక కొన్ని నియమాలను పాటించాలి.
Video Advertisement
అలానే అంతా సవ్యంగా జరగాలన్నా, ప్రకృతి వైపరీత్యాలు వంటివి రాకుండా ఉండాలన్నా దేవాలయాలని మనం పరమ పవిత్రంగా భావించి.. నియమాలతో అనుసరించాలి.
- దేవాలయంలో వాహనాలతో కానీ పాదరక్షలతో పాటు కానీ రాకూడదు. అలా వెళ్లడం అస్సలు మంచిది కాదు. బయట వదిలి లోనికి వెళ్ళాలి.
- దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు వంటివి ధరించి వెళ్ళకూడదు. పరనింద, పరస్తుతి చేయడం కూడా చెయ్యకూడదు.
- అలానే దేవాలయానికి వెళ్ళినప్పుడు నోట్లో ఏదోకటి నవులుతూ వెళ్ళకూడదు మరియు దేవాలయ ప్రాంగణంలో మలమూత్ర విసర్జన చేయకూడదు.
- దేవాలయంలో పోట్లాడుకోవడం, గొడవలాడుకోవడం లాంటివి చెయ్యడం తప్పు. ఒక వేళ ఇలా చేస్తే క్షేత్ర దర్శన ఫలితం ఉండదు.
- ప్రదక్షిణం చేయకుండా దేవాలయ దర్శనం చేసుకోకూడదు. ఓపిక లేని వాళ్లు కూడా ఒక్క సారి అయినా ప్రదక్షిణం చేసి ఆ తర్వాత మాత్రమే దర్శనం చేసుకోవాలి. మరియు దేవాలయ దర్శనం అయి పోయిన తర్వాత తప్పని సరిగా
- ఆలయ ప్రాంగణం లో కూర్చుని ఆ తర్వాత మాత్రమే ఇంటికి వెళ్ళాలి.
- దేవాలయంలో పడుకోకూడదు. అలాగే కాళ్ళు జాపుకొని కూర్చోవడం చేయకూడదు.
- భగవంతునికి తప్ప దేవాలయ ప్రాంగణంలో ఎవ్వరికీ నమస్కారం చేయకూడదు.
- దేవాలయ దర్శనం కి వెళ్ళినప్పుడు కిరీటం కానీ తలపాగ కానీ ధరించి వెళ్ళకూడదు.
- దేవాలయం లో కూర్చుని ఏమి చదివినా కూడా వంద రెట్లు ఫలితం పొందొచ్చు. ఇలా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా అనుసరించడం మంచిది. తెలిసి కానీ తెలియక కానీ ఈ తప్పులు చెయ్యడం మంచిది కాదు.
End of Article