కాలిఫ్లవర్ తో మనం చాలా రకాల వంటకాలని తయారు చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ కర్రీ, ఫ్రై, మంచూరియా ఇలా ఎవరికి నచ్చినది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే కాలీఫ్లవర్ లో పోషకం పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ కె ఇందులో ఉంటుంది. అలానే ఫైటో న్యూట్రిఎంట్స్, ఫోలేట్ కూడా కాలీఫ్లవర్ లో ఉంటాయి. కాలీఫ్లవర్ వలన ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనం పొందొచ్చు. కానీ కాలీఫ్లవర్ ని మాత్రం వీళ్లు అసలు తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Video Advertisement

మరి కాలీఫ్లవర్ ని ఎవరు తీసుకోకూడదు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. గ్లూకోసినోలేట్స్ అనే సల్ఫర్ వుండే రసాయనాలు కాలీఫ్లవర్ లో ఉంటాయి కనుక దీన్ని తినడం వలన కొంత మంది ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది చెడు చేయగలదు. ఇక మరి ఎవరు దీన్ని తీసుకోకూడదు అనేది తెలుసుకుందాం.

#1. థైరాయిడ్ సమస్య:

థైరాయిడ్ సమస్య ఉంటే దీనికి దూరంగా ఉండాలి. థైరాయిడ్ సమస్య వున్నవాళ్లు తీసుకుంటే T-3, T-4 హార్మోన్లు పెరిగి థైరాయిడ్ సమస్య ని ఎక్కువ చేస్తుంది.

#2. కడుపులో గ్యాస్:

రాఫినోస్ అనే ఓ హానికరమైన పదార్థం. ఇది ఒక కార్బోహైల్డ్రేట్. పిండి పదార్థాన్నిరాఫినోస్ విచ్ఛిన్నం చేయలేవు. ఎక్కువ కార్బోహైడ్రేట్ తింటే అది చిన్న పేగు నుంచి పెద్ద పేగులకు వెళ్లి.. బ్యాక్టీరియా కిణ్వ ప్రక్రియ మొదలు పెట్టడం తో.. కడుపులో గ్యాస్ కలుగుతుంది. కడుపు కూడా ఉబ్బుతుంది.

#3. రక్తం చిక్కగా అవుతుంది:

బ్లడ్ థినర్స్ తీసుకుంటే దీన్ని తీసుకోకూడదు. పొటాషియం దీనిలో ఎక్కువ ఉంటుంది. సో బ్లడ్ చిక్కగా అయ్యిపోతుంది.

#4. బరువు సమస్య:

బరువు పెరగాలి అనుకుంటే ఎక్కువ తినకూడదు. ఎందుకంటే దీన్ని తీసుకుంటే ఆకలి పుట్టదు. అలానే పాలిచ్చే తల్లుల్లు కూడా తీసుకోకూడదు.