Ads
చాలా మంది సొంతింటి కలని నిజం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే దీని కోసం చాలా మంది హోమ్ లోన్ తీసుకుంటూ ఉంటారు. కానీ హోమ్ లోన్ త్వరగా క్లియర్ చేయాలని తప్పులు చేస్తూ ఉంటారు. దానికోసం ఈరోజు మనం చూద్దాం. భవిష్యత్తులో రిలాక్స్ గా ఉండాలని త్వరగా హోం లోన్ ని క్లియర్ చేస్తూ ఉంటారు.
Video Advertisement
అయితే క్లియర్ చేయడంలో తప్పులేదు కానీ ఆ క్రమంలో ఈ తప్పులు మాత్రం చేయొద్దు. సాధారణంగా ఎవరైనా హోమ్ లోన్ ని తీసుకున్నట్లయితే..
20 ఏళ్ళపాటు డబ్బులు కట్టాలి కదా అని చెప్పి త్వరగా డబ్బులు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే హోమ్ లోన్ ని క్లియర్ చేయడానికి వాడుతూ ఉంటారు. అయితే హోమ్ లోన్ పే చేయడంలో తప్పులేదు కానీ కొన్ని ముఖ్యమైన పనుల్ని దృష్టిలో పెట్టుకోవడం లేదు. పిల్లల చదువుకోసం కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత సేవింగ్స్ కోసం కానీ ఇటువంటి వాటిని ఏమీ పట్టించుకోకుండా హోమ్ లోన్ పైన దృష్టి పెడతారు.
దీనిని క్లియర్ చేస్తూ ముఖ్యమైన పనులపై కూడా దృష్టి పెట్టాలి. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ముందు ఇది క్లియర్ అయిపోతే మిగిలిన వాటి మీద నేను ఏకాగ్రత పెట్టొచ్చు కదా డబ్బులు దాచచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఇది జరగదు. దీనికోసం ఒక ప్లాన్ మరియు ఒక గోల్ ని సెట్ చేసుకుంటూ ఉండాలి అనీ ఈ వీడియో లో చెప్పారు.
అలానే మనకి మిగిలిన డబ్బులు అంటే సొంత ఇల్లు కట్టుకోవడం వల్ల మిగిలే రెంట్ డబ్బులు మరియు కలిగే టాక్స్ బెనిఫిట్స్ డబ్బులు తీసుకుని వెళ్లి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని ఈ వీడియో ద్వారా తెలిపారు. ఇలా అనుసరించడం వల్ల హోమ్ లోన్ ని తక్కువ పెట్టి క్లియర్ చేయొచ్చని అంటున్నారు. అలానే పదేళ్ల లోనే లోన్ ని ఎలా క్లియర్ చేసుకోవచ్చని కూడా చెప్పారు.
మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టడం వల్ల ఎలా హోమ్ లోన్ కి ప్రాఫిట్ అవుతుంది అనేది కూడా వివరించారు. కాబట్టి మీరు హోమ్ లోన్ తీసుకున్నట్లయితే ఈ వీడియోని చూసి దీని ప్రకారం నడుచుకుంటే సాధారణంగా అందరు చేసే తప్పులు మీరు చెయ్యకుండా ఉండడానికి అవుతుంది.
End of Article