Ads
మానవ ప్రయత్నం ఎంత చేసినప్పటికీ ఇంట్లో గాని, వ్యక్తిలో గాని అభివృద్ధి కనిపించకపోతే కచ్చితంగా మానవతీత శక్తి ఒకటి మనకి అవరోధంగా ఉందని ఆలోచించాలి. మన కష్టానికి దైవానుగ్రహం తోడైతేనే మన అభివృద్ధి బాగుంటుంది. మనం ఎంత ప్రయత్నించినప్పటికీ మన చేతిలో డబ్బులు నిలవక పోవటం, మన కుటుంబంలో శాంతి లేకపోవటం, మన జీవితంలో అభివృద్ధి సాధించలేకపోవడం వంటివి జరుగుతున్నాయంటే కచ్చితంగా ఎక్కడో ఏదో దోషం ఉన్నట్లు లెక్క.
Video Advertisement
ముందుగా మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయేమో పరిశీలించండి. మీ ఇంటి టెర్రస్ పై ఈ వస్తువులు ఉంచినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. టెర్రస్ పై ఈ వస్తువులు లేకుండా చూడండి. అవేమిటో చూద్దాం. ఇంటి టెర్రర్స్ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా లేని టెర్రస్ లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పిస్తుంది. టెర్రస్ ఎప్పుడూ మొక్కలు, పచ్చని చెట్లతో కళకళలాడుతూ ఉంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది.
నీలం పువ్వులు ఉన్న మొక్కలను ఉత్తర దిశలో, పడమర దిశలో తెల్లని పువ్వులతో కూడిన మొక్కలను నాటడం వలన పిల్లలలో సృజనాత్మక శక్తి పెరుగుతుందని పెద్దలు చెప్తారు. అలాగే టెర్రస్ పై వాటర్ ట్యాంక్ ని పెట్టినట్లయితే దానిని నైరుతి దిశలో ఉండేలాగా చూసుకోండి. అలాగే ఎట్టి పరిస్థితులలోనూ టెర్రస్ పై తుప్పు పట్టిన ఇనుము లేదా వెదురు వస్తువులను ఉంచకండి, దీనివల్ల రాహు దోషం పెరుగుతుంది. అలాగే టెర్రస్ లేదా ఇంటి పైకప్పు ఎప్పుడూ శిధిలమై ఉండకూడదు.
వాస్తు విశ్వాసాల ప్రకారం పైకప్పు పగుళ్లు, వర్షాకాలంలో తేమ కారణంగా ఇంట్లో తీవ్రమైన వాస్తు దోషాలు ఏర్పడుటమే కాకుండా లక్ష్మీదేవి ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వస్తుంది.అలాగే చీపురు కట్ట ఇంటిపై కప్పు పై ఉంచకూడదు. చీపురు ఇంటి టెర్రస్ పై ఉంటే దొంగతనాల భయం నెలకొంటుంది. జాగ్రత్తలు పాటిస్తూనే లక్ష్మీదేవిని నిత్యం ప్రసన్నం చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం తో పాటు జీవితంలో అభివృద్ధి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
End of Article