Chanakya Neethi: స్నేహితుడే కదా అని ఎట్టిపరిస్థితి లోను ఈ 3 విషయాలని షేర్ చేసుకోకండి..!

Chanakya Neethi: స్నేహితుడే కదా అని ఎట్టిపరిస్థితి లోను ఈ 3 విషయాలని షేర్ చేసుకోకండి..!

by Megha Varna

Ads

చాణక్యుడు ఎంతటి మహా జ్ఞానో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు.

Video Advertisement

చాణక్య నీతి ప్రతి అంశాన్ని కూడా ఎంతో అద్భుతంగా వివరించింది. చాణక్యుడు స్నేహితుల గురించి కూడా ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. వాటిని కనుక అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళిపోవచ్చు. అయితే మీకు ఎంత దగ్గరి స్నేహితులైనా సరే ఈ 3 విషయాలని అసలు వాళ్ళతో షేర్ చేసుకోకూడదని ఆచార్య అన్నారు. మరి అవేమిటో చూద్దాం.

#1. భార్య గుణం గురించి చెప్పుకోవద్దు:

నా భార్య అలాంటిది, నా భార్య ఇలాంటిది అని ఎప్పుడూ కూడా మీ స్నేహితులతో ప్రస్తావించద్దు. ఇలా కనుక చెప్పారంటే ఖచ్చితంగా భార్య భర్తల మధ్య గొడవలు అవుతాయి. అలాగే భవిష్యత్తులో ఎంత పెద్ద సమస్య అయినా ఇది తీసుకురావచ్చు.

#2. అవమానాల గురించి చెప్పొద్దు:

మీరు ఎదుర్కొన్న అవమానాలు గురించి కూడా మీ స్నేహితులతో చెప్పకండి. ఇవి కనుక నిజంగా బయటికి వెళ్లాయంటే… అవి గౌరవం పై ప్రభావం చూపుతాయి.

#3. బాధలను చెప్పవద్దు:

మీ యొక్క బాధలను ఎవరికీ చెప్పద్దు అని ఆచార్య చాణక్య చాణక్య నీతి లో చెప్పారు. మీ బాధలను చెప్పుకుని ఓదార్పు పొందాలని అనుకుంటే పొరపాటే. దీనివల్ల మీ బంధుత్వం చెడిపోతుంది. అలానే వాళ్ళు మిమ్మల్ని ఎగతాళి కూడా చేస్తారు. కనుక ఎప్పుడూ కూడా ఈ మూడు విషయాలను ఎవరితోనూ చర్చించకండి.


End of Article

You may also like