ప్రతి రోజు మనం ఆహారంగా అన్నాన్ని తీసుకుంటూ ఉంటాము. పోషక పదార్థాలు అన్నీ మనకి అందాలంటే అన్నం లో పప్పు, కూర వంటివి చేసుకొని తీసుకోవాలి. కానీ బాగా బరువుగా ఉన్న వాళ్ళు అన్నం తినకుండా అన్నానికి దూరంగా ఉంటారు. షుగర్ తో బాధ పడే వాళ్ళు కూడా రోటి వంటివి తీసుకుంటూ ఉంటారు తప్ప అన్నాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపించరు.  కానీ అన్నం వండుకునేటప్పుడు ఈ విధంగా చేస్తే బరువు పెరిగిపోకుండా ఉండొచ్చు.

Video Advertisement

అయితే ఈ విషయం చాలా మందికి తెలియక అన్నం తీసుకుంటే బరువు బాగా పెరిగిపోతావని భయ పడి అన్నానికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు.

ఈ చిన్న చిట్కాలను కనుక అనుసరిస్తే అన్నం లో సగానికి పైగా క్యాలరీలని మనం తగ్గించుకోవడానికి అవుతుంది. మరి ఎలా తగ్గించుకో వచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. పరిశోధకలు అన్నం లో క్యాలరీలని ఈ విధంగా తగ్గించచ్చని అన్నారు.

కొబ్బరి నూనె తో క్యాలరీలు తగ్గుతాయి:

మీరు అన్నం లో క్యాలరీలని తగ్గించడానికి అన్నాన్ని వండేటప్పుడు ఆ నీళ్ళల్లో కొబ్బరి నూనె ని వెయ్యండి. ఇలా చేయడం వలన సగానికి పైగా క్యాలరీలని మనం తగ్గించుకోవడానికి అవుతుంది. అలానే మరెంత తగ్గాలంటే అన్నం వండాక ఆ అన్నాన్ని మీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. ఇలా మీరు ఫ్రిజ్డ్ లో పెడితే క్యాలరీలు తగ్గుతాయి. ఒకవేళ కనుక ఫ్రిడ్జ్ లో పెట్టడం వలన టెంపరేచర్ మారిపోతుంది అని మీకు అనిపిస్తే తినే ముందు బయట పెట్టుకుంటే మళ్లీ నార్మల్ టెంపరేచర్ లోకి వచ్చేస్తుంది సో మీరు క్యాలరీలని తగ్గించుకోవడానికి ఈ విధంగా ఫాలో అవ్వచ్చు.

rice bag 1

అన్నం వందేటప్పుడు కొబ్బరి నూనె వేసేసి తర్వాత కొన్ని గంటలపాటు ఫ్రిజ్డ్ లో ఉంచితే చక్కగా క్యాలరీలు తగ్గిపోతాయి తర్వాత మీరు ఏ భయం లేకుండా అన్నం తినొచ్చు. శ్రీలంకకు చెందిన పరిశోధకులు చేసిన పరిశోధన ద్వారా ఈ ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. సో ఈసారి ఎటువంటి భయం లేకుండా ఇలా ఫాలో అయిపోండి.