Ads
వర్షాకాలంలో ఉదయాన్నే లేచి బయటకు వెళ్లాలంటే బండి స్టార్ట్ అవ్వదు. చాలా మంది ఎదుర్కొనే సమస్యే ఇది. వర్షాకాలంలో వాహనాలకు మనకి ఎలా అయితే సమస్యలు వస్తాయో వాటికి కూడా సమస్య వస్తుంది. ఒకవేళ కనుక మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటే ఈ విధంగా అనుసరించండి.
Video Advertisement
ఉదయాన్నే మీరు మీ బండిని స్టార్ట్ చేయాలంటే కిక్ తో స్టార్ట్ చేయడం మంచిది. ఒకసారి బైక్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని సార్లు అయినా మీరు సెల్ఫ్ ని ప్రెస్ చేసి స్టార్ట్ చేయొచ్చు. అంతే కానీ ముందే సెల్ఫ్ తో స్టార్ట్ చేస్తే ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా స్టార్ట్ కాదు. కనుక మొదట సెల్ఫ్ ని వాడకుండా కిక్ కొట్టండి. అప్పుడు త్వరగా బండి స్టార్ట్ అవుతుంది.
Also Read: బ్రాహ్మణుల్లో చాలామంది ఉల్లిపాయ, వెల్లుల్లిని ఎందుకు తినరు..? దీని వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటో తెలుసా..?
అలానే స్పార్క్ ప్లగ్ లు బైక్ లో చాలా ముఖ్యమైనవి. ఈ స్పార్క్ ప్లగ్ కనుక పని చేయకపోతే బండి స్టార్ట్ అవ్వదు. కనుక రెగ్యులర్ గా దానిని శుభ్రం చెయ్యండి. దీనిని మనం ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు.
ఒకవేళ బండి స్టార్ట్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంటే చోక్ ఇచ్చి అప్పుడు స్టార్ట్ చేయండి. ఒకసారి చోక్ ఇవ్వడం వల్ల వెంటనే బండి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీ బండిలో ఇంజన్ ఆయిల్ తక్కువగా ఉంటే అది ఎక్కువ ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి ఇంజిన్ ఆయిల్ ని రెగ్యులర్ గా మార్చడం ముఖ్యం.
ప్రతి రోజు మీ బండిని నడపక పోయినా కూడా సమస్య వస్తుంది. చలి కాలంలో రెండు రోజులకొకసారి బండిని స్టార్ట్ చేస్తూ ఉండాలి. చాలా రోజులకి మీరు బండిని తీసినా సమస్య వస్తుంది.
End of Article