కోలీవుడ్ లో “ప్రేమిస్తే” సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా అక్కడ పెద్ద హిట్ అయింది. ఆ తరువాత తెలుగు లోకి అనువదిస్తే, తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కి బాగా కనెక్ట్ అయిపోయారు. ఆ సినిమా లో హీరోయిన్ సంధ్య ని ఇప్పటికి మర్చిపోలేరు. ఈ సినిమా కోసం ఓ పల్లెటూరి అమ్మాయి కావాలని, ఈ సినిమా డైరెక్టర్ శంకర్ ఎంతగానో వెతికి సంధ్యను ఎంచుకున్నారు.

sandhya feature image

ఈ సినిమా కి బాలాజీ శక్తివేల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. అసిస్టెంట్ డైరెక్టర్ బాలాజీ శక్తివేల్ తాను ఓ సారి రైల్లో ప్రయాణిస్తూ ఉండగా, తన పక్కన కూర్చున్న ప్రయాణికుడు నిజమైన ప్రేమ కథ ను చెప్పగా, ఈ స్టోరీ ని రాసుకున్నారు. ఓ నిజమైన ప్రేమ కథ నే సినిమా గా మలిచి “ప్రేమిస్తే” ని తీశారు. ఈ సినిమా 2004 లో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది. ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన సంధ్య ఆ తరువాత కన్నడ, తమిళ, తెలుగు సినిమాలు కలిపి మొత్తం 40 సినిమాలు చేసింది. తెలుగు లో కూడా పవన్ కళ్యాణ్ సినిమా “అన్నవరం” లో పవన్ చెల్లెలు గా కనిపించి అదరగొట్టేసింది. తెలుగు వారికి కూడా సుపరిచితం అయిపొయింది.

 

ఇక ఆమె పర్సనల్ లైఫ్ లోకి వస్తే, చంద్రశేఖర్ అనే ఐటి ఉద్యోగి ని సంధ్య పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తరువాత సంధ్య సినిమా లైఫ్ కి దూరం గా ఉన్నారు. వీరిద్దరూ గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ, వీరు పెళ్లి చేసుకోవాలనుకున్న ముహూర్తం టైం లో చెన్నై లో పెద్ద తుఫాను వచ్చింది. ఈ వర్షాల కారణం గా వారు 2015 డిసెంబర్ ఆరవ తేదీన చాలా సింపుల్ గా గురువాయూర్ దేవాలయం లో పెళ్లి చేసుకున్నారు. తాజాగా, సంధ్య ఓ పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ సంధ్య స్నేహితురాలు వరుణి ట్విట్టర్ మాధ్యమం ద్వారా అందరితో పంచుకున్నారు.

sandhya husband

అయితే, సంధ్య కు పాప ఎప్పుడు పుట్టిందో తెలియలేదు. వరుణి ట్విట్టర్ లో పంచుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం సంధ్య తన ఫామిలీ తో కలిసి చెన్నై లోనే ఉంటోంది. అయితే, ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ తమిళ చిత్రం హీరోయిన్ కు అక్క గా నటించే పాత్రకి సంధ్య ఒకే చెప్పిందని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లే జరిగితే, సంధ్య ని మళ్ళీ మనం వెండితెరపై చూడొచ్చు.

sandhya daughter