బరువు తగ్గడానికి జీలకర్ర నీరు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

ప్రతి ఒక్కరి వంటగదిలో జిలకర్ర అనేది తప్పనిసరిగా ఉంటుంది. జీలకర్రను వండే కూరలో వేస్తే ఆ కర్రీ రుచి మారుతుంది. అయితే ఇది వంటకాలలో ఎందుకు వాడుతారో తెలుసుకుందాం..!

ముఖ్యంగా జీలకర్రలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆహారంలో వాడడం వల్ల దాని రుచి పెరగడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. దీనిలో బరువు తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. జీలకర్రను రెగ్యులర్ గా వాడడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.

ఈ జీలకర్రలో క్రిమినాశక గుణాలు ఎక్కువగా ఉండటం వలన వాపులు మరియు గాయాలను తొందరగా తగ్గిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా దీన్ని వాడాలి. జిలకర్రలోని మరో ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఉండే యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు అనేకం ఉన్నాయి. పొట్ట మరియు కాలేయంలో ఏర్పడే ట్యూమర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయం చేస్తాయి.

అలాగే జీలకర్ర నీరు బరువు తగ్గించడంలో ప్రభావం చూపిస్తుంది. కానీ ఈ నీటిని తీసుకోవడంలో చాలామంది తప్పులు చేస్తారు. అలాంటి తప్పులు తెలుసుకుని సరైన మార్గంలో వాడితే మంచి ప్రభావాన్ని చూపిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.