Ads
విఘ్నేశ్వరుడు అందరికి ప్రీతిపాత్రుడు. ఎటువంటి కార్యం తలపెట్టినా విఘ్నాలు ఎదురవకుండా కాపాడాలని గణపతిని కోరుతుంటాం. విఘ్నాలకు అధిపతి ఐన గణపతి కూడా భక్త సులభుడే. భక్తుల కోరికలను మన్నిస్తాడు. ఆయన విఘ్నాధిపతి కాబట్టి ఏ పనికి ఐన, పూజకు అయినా ముందు ఆయననే పూజిస్తాం. ఏ దేవుడిని పూజించాలన్నా.. ముందు గణపతిని తలచుకుని.. విఘ్నాలు రాకుండా చూడమని ప్రార్ధించి ఆ తరువాత పూజ చేసుకుంటాం.
Video Advertisement
ఇక గణపతి విగ్రహాలు కానీ, చిత్రపటాలు కానీ లేని భక్తుల ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. అయితే.. పూజ మందిరం లో మాత్రం ఒక్క గణపతి విగ్రహం కంటే ఎక్కువ ఉండకూడదట. అలా ఉంచితే సిద్ధి, బుద్ధి లకు చాలా ఆగ్రహం కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే పూజా మందిరం లో మాత్రం ఒక్క గణపతి విగ్రహమే ఉండాలని చెబుతుంటారు.
ఇక.. గణపతి విగ్రహాలలో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కో రకమైన విగ్రహం వలన ఒక్కో ఫలితం ఉంటుందట. అవేంటో కూడా ఇప్పుడు చూసేద్దాం.
పని చేసే ప్రదేశం:
వ్యక్తులు తాము ఉద్యోగం చేసే చోట.. పని చేసుకునే చోట నిలుచుని ఉన్న గణేష్ విగ్రహాలను పూజిస్తూ ఉంటె వారికి ఒత్తిడి తొలగిపోతుంది. ఎంతటి పని ఉన్నా సరే ప్రశాంతం గా చేసుకుంటూ ఉంటారట.
ఎక్కడైనా:
ఏ ప్రదేశం లో అయినా సరే వ్యక్తులు కూర్చుని ఎడమ వైపు తొండం ఉన్న గణేష్ విగ్రహాన్ని పెట్టుకుంటే వారికి సకల విజయాలు లభిస్తాయట.
ఇంట్లో :
తెలుపు రంగులో ఉండే గణేష్ విగ్రహాలను ఇంట్లో ఉంచుకోవడం శుభసూచకమట. ఆ ఇంట్లో ఉండే చికాకులు తొలగిపోయి.. అభివృద్ధి నెలకొంటుంది.
ఎరుపు రంగు గణపతి:
ఎరుపు రంగు గణపతిని పూజిస్తే.. భక్తులు కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయట. ఆ గణనాధుడు ఎల్లప్పుడూ వారిని కష్టాల నుంచి గట్టెక్కిస్తాడట.
లడ్డు, ఎలుక ఉన్న గణేష్ విగ్రహాలు:
లడ్డుని పట్టుకుని ఉన్న గణేష్ విగ్రహం, కింద చిన్న ఎలుక ఉన్న విగ్రహాన్ని పూజిస్తే ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది.
స్వస్తిక్ గణేష్:
స్వస్తిక్ గుర్తు ఉన్న గణేష్ విగ్రహాన్ని ఇంట్లో ఉత్తర దిక్కు గా పెట్టుకుంటే.. ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి.. ఆ ఇంట్లో ని వారు సుఖశాంతులతో ఉంటారట.
End of Article