మీ అరచేతులకు చెమటలు పడుతున్నాయా.? అశ్రద్ధ చేయకండి…ఈ వైఫల్యం కావచ్చు!

మీ అరచేతులకు చెమటలు పడుతున్నాయా.? అశ్రద్ధ చేయకండి…ఈ వైఫల్యం కావచ్చు!

by Mounika Singaluri

Ads

ఒక్కొక్కసారి ఎలాంటి శారీరిక శ్రమ లేకుండానే అరచేతులు చెమటలు పడుతుంటాయి. అయితే చలికాలంలో కూడా ఇలా అరచేతులకు చెమటలు పడితే తేలికగా తీసుకోకండి, మీ శరీరంలో కాలేయ వైఫల్యానికి ఇదొక సంకేతం కావచ్చు. వైద్యుల అభిప్రాయం ప్రకారం అరచేతులపై తరచూ చెమటలు పట్టడం కాలేయ సమస్యకు సంకేతం. రక్తాన్ని శుభ్రం చేసే సామర్థ్యాన్ని క్రమంగా కిడ్నీలు కోల్పోతున్నప్పుడు శరీరంలోని ఇతర భాగాలతో పాటు అరచేతుల నుంచి కూడా చెమటలు బయటికి వస్తాయి.

Video Advertisement

అలాగే హైపర్ థైరాయిడిజం కలిగిన వారికి అధిక థైరాక్సిన్ ఉత్పత్తి కారణంగా కూడా ఎక్కువగా చెమట పడుతుంది.ఈ సమస్య తలెత్తిన వెంటనే వైద్యులని సంప్రదించాలి. లక్షణాలను సకాలంలో గుర్తించడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను సులభంగా నయం చేయవచ్చు అంటున్నారు వైద్యనిపుణులు. అరచేతులకు చెమటలు పట్టడం ఫ్యాటీ లివర్ కి సంకేతం అయినప్పటికీ ఈ లక్షణాలు అన్ని సందర్భాలను అందరికీ ఒకే విధంగా ఉండవని కూడా చెప్తున్నారు. అరచేతులపై ఎక్కువగా సెబాషియస్ గ్రంధులు ఉండటం వలన కూడా చెమటపడుతుంది.

దీని కారణంగా చర్మం జిడ్డుగా మారడం ప్రారంభమవుతుంది. ఫలితంగా అరచేతులు చెమటలు పడతాయి. ఇటువంటి సందర్భాల్లో డాక్టర్ చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ అనేది చాలా సాధారణమైన వ్యాధిగా మారిపోతుంది అంటున్నారు వైద్యులు. చిన్న వయసులోనే ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సమస్యకు తొలినాళ్లలో చికిత్స ద్వారా నయం చేయవచ్చు కానీ ఆశ్రద్ధ చేస్తే లివర్ పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంది.

మద్యం తాగిన వారు కూడా ప్రస్తుత కాలంలో ఫ్యాటీ లివర్ బారిన పడుతున్నారు. సరైన ఆహార ప్రణాళిక లేకపోవడం వలన, పెరుగుతున్న ఊబకాయం వలన ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా ఉందంటున్నారు. అయితే డైట్ ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చని ముందుగా ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలి, అలాగే ప్రతి రోజు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం ఫాస్ట్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండాలి.


End of Article

You may also like