చిత్ర సీమ లో నెగ్గుకురావాలంటే టాలెంట్ తో పాటు అప్పుడప్పుడు అదృష్టం కూడా కలిసి రావాలి. కాలం అనుకూలించనపుడు వేచి చూసి.. విజయం వరించేదాకా పోరాడాల్సిన ఓర్పు, ధైర్యం ఉండాలి. అలా లేకపోతె, ఇక్కడ రాణించడం కష్టమవుతుంది. తట్టుకోలేకపోతే.. దురదృష్టవశాత్తు చిత్ర సీమ టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ను కోల్పోతుంది. అలా తెలుగు సినిమా అభిమానులు మిస్ చేసుకున్న నటుడు “ఉదయ కిరణ్”. సినిమాలు హిట్ అవకా, కొత్త అవకాశాలు రాక బలహీనమైన మనస్తత్వం తో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని సినీ ఇండస్ట్రీ కి దూరం అయిన సంగతి తెలిసిందే.

uday wife vishita 1

ఏళ్ళు గడుస్తున్నా.. ఉదయ్ కిరణ్ ని ఈ చిత్ర సీమ మర్చిపోదు. అతని అభిమానుల గుండెల్లోనూ, అతని సినిమాల్లోను ఉదయ్ కిరణ్ ఇంకా కనిపిస్తూనే ఉంటాడు. ఉదయ్ కిరణ్ ను ఎంతగానో ప్రేమించిన అతని భార్య విషిత.. కష్టకాలం లో కూడా ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది. అనుక్షణం అతని వెన్నంటే ఉంది. ఆమె సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా పని చేసేది.

ఉదయ్ ని పెళ్లి చేసుకోక ముందునుంచే ఆమె జాబ్ చేసేది. ఉదయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత ఎంతో హ్యాపీ గా సాగిపోతున్న వారి జీవితం లో వరుస ఫ్లాపులు ఉదయ్ ను చుట్టిముట్టాయి. ఆ సమయం లో ఉదయ్ ఎంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయేవాడు.

uday wife vishita 3

అలాంటి టైం లో కూడా విషిత ఎంతో సపోర్ట్ చేసింది. ఇది కాకపొతే మరో ఇండస్ట్రీ అంటూ ధైర్యం చెప్పింది. పలుసార్లు ఉదయ్ ను కౌన్సిలింగ్ కి కూడా తీసుకెళ్లింది అని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. తమిళ్ ఇండస్ట్రీ లో కూడా ప్రయత్నాలు చేద్దాం అని అక్కడ పాతికవేలు పెట్టి ఫ్లాట్ కూడా తీసుకుందట. కానీ, డిప్రెషన్ ఎక్కువైన ఉదయ్ కిరణ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయ్ కిరణ్ వెళ్ళిపోయాక విషిత అంతులేని బాధ అనుభవించింది.

ఇప్పటికి ఆమె ఒంటరిగానే గడుపుతోంది. ఆమె తన సాఫ్ట్ వేర్ జాబ్ ని చేసుకుంటూ వృద్ధాశ్రమాలకు, అనాధాశ్రమాలకు విరాళాలు ఇస్తూ కాలం గడుపుతోంది. ఇప్పటికే ఉదయ్ కిరణ్ నే తలుచుకుని గడుపుతోంది సోషల్ మీడియా లో పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.