Home Off Beat విమానాలు ఎక్కువగా తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి..? దీని వెనుక అసలు కారణం ఇదే..!

విమానాలు ఎక్కువగా తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి..? దీని వెనుక అసలు కారణం ఇదే..!

by Megha Varna

మనం సాధారణంగా విమానాలను చూసినప్పుడు తెలుపు రంగులో ఉంటాయి. అయితే ఎప్పుడైనా ఎందుకు విమానాలు తెలుపు రంగులో ఉంటాయి అని ఆలోచించారా…? ఆలోచించినా మీకు సమాధానం దొరకలేదా..? అయితే తప్పకుండా ఇక్కడ మీరు వెతుకుతున్న సమాధానం దొరుకుతుంది. విమానాలు చూసినప్పుడు అవి తెల్లగా ఉంటాయి. ఎందుకు తెలుపు రంగుని వాడతారు అనేది మనం చూస్తే… విమానాలకు తెలుపు రంగు వేయడం వల్ల ధర్మల్ అడ్వాంటేజ్ ఉంటుంది.

అదే విధంగా ఏదైనా పగుళ్ళు కానీ ఇబ్బందులు కానీ వస్తే గమనించడానికి కూడా సులభంగా ఉంటుంది. తెలుపు రంగుని విమానానికి వేస్తె ధర కూడా ఎక్కువ పలుకుతుంది. తెలుపు రంగు నిజంగా మంచి రిఫ్లెక్టర్. ఇది సూర్యకిరణాలని రిఫ్లెక్ట్ చేస్తుంది. అదే విధంగా లైట్ ని కూడా అది రిఫ్లెక్ట్ చేస్తుంది. అదే మనం ఇతర రంగుల్ని వాడితే అవి కొంత వరకు కాంతిని అబ్సర్బ్ చేసుకుంటాయి.

This is why Airplanes are white in color - OrissaPOST

కానీ తెలుపు కాకుండా ఏ ఇతర రంగులను వాడినా ఖచ్చితంగా సూర్యకాంతి లాగేసుకుంటుంది. అలాగే విమానం యొక్క బాడీ ఎంతో వేడి అయిపోతుంది. విమానాలకు ఏమైనా ఇబ్బందులు వున్నా లేదా ఏదైనా పగుళ్లు వంటివి ఏర్పడ్డాయా అనేది చూసేటప్పుడు తెలుపు రంగు ఉంటే గమనించటం సులభంగా ఉంటుంది. అలానే రంగు వేయడం కూడా కష్టమే. రంగు వేయడానికి ఎక్కువ డబ్బులు అవుతాయి. అలానే ఎక్కువ శ్రమ కూడా తీసుకుంటుంది.

Aeroplanes Stock Photos & Royalty-Free Images | Depositphotos

ఒక సాధారణ విమానాన్నిపెయింట్ చేయాలంటే ఒక రోజు నుండి 7 రోజులు పడుతుంది. అలానే విమానాన్ని మీరు అమ్మేయాలనుకుంటే తెలుపు రంగుకి ఎక్కువ పలుకుతుంది. అదే ఒకవేళ వేరే రంగు అయితే తక్కువ పలుకుతుంది. రంగు వెలిసిపోవడం వంటి సమస్యలు కూడా ఉండవు. సైంటిఫిక్ పరంగా మరియు ఎకనామికల్ పరంగా చూసుకున్నట్లయితే తెలుపు రంగు వేయడం మంచిదని తెలుస్తోంది. అందుకే ఎక్కువ విమానాలు తెల్లగా ఉంటాయి.

You may also like