Ads
‘అలియా హై స్కూల్ ఫర్ బాయ్స్’ 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. గత ఏడాది 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలను జరుపుకుంది. గతంలో ఈ స్కూల్ ను ‘మదర్సా-ఎ-అలియా’ అని పిలిచేవారు. ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న ఈ స్కూల్ హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రీలో ఉంది.
Video Advertisement
ఈ పాఠశాల గురించి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఈ స్కూల్ ఎంతోమంది ప్రముఖులను అందించింది. వారిలో గవర్నర్లు, శాస్త్రవేత్తలు, క్రికెటర్లు, ఫుట్‌బాల్ ఆటగాళ్ళు మరియు ఐఏఎస్ అధికారులు ఉన్నారు. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గన్‌ఫౌండ్రీలో నిజాం కళాశాలలోని పాఠశాల ఆవరణలో స్కూల్ పూర్వ విద్యార్థులు హాజరు అయ్యి, తమ జీవితాల్లో మదర్సా-ఇ-అలియా చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
నిజాంల హయాంలో సాలార్ జంగ్ I చేత 1872లో ‘మదర్సా-ఎ-అలియా’ స్థాపించబడింది. నగరంలోని అత్యంత పురాతనమైనది. రాజుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సంస్థ. 1949లో కింగ్ కోఠి ప్యాలెస్ సమీపంలో ఉన్న పాఠశాల ఆ తరువాత గన్‌ఫౌండ్రీ క్యాంపస్‌కు మార్చబడింది. 1960ల వరకు ఈ స్కూల్ హైదరాబాద్‌లోని అత్యుత్తమ పాఠశాలల్లో ఒకటిగా ఉంది. ఈ పాఠశాల ఆంగ్లో-ఇండియన్లచే నిర్వహించబడింది. అయితే ఆపరేషన్ పోలో తర్వాత పాఠశాల నిర్వహణ అంతా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది.
ఇదే ఆ పాఠశాల పతనానికి కారణమైందని అంటారు. ఈ పాఠశాల భవనం వారసత్వ భవన లిస్ట్ లో చేర్చబడింది. ఈ పాఠశాలలో సైన్స్ ల్యాబ్‌ల నుండి క్రీడా సౌకర్యాల వరకు అన్నింటిని కలిగి ఉంది. ఈ స్కూల్ నుండి చాలా మంది ప్రముఖులు బయటకు వచ్చారు. ఉదాహరణకు, నలుగురు గవర్నర్లు, అలీ యావర్ జంగ్ (మహారాష్ట్ర), మెహదీ నవాజ్ జంగ్ ( గుజరాత్), ఇద్రిస్ హసన్ లతీఫ్ (విమాన సిబ్బంది చీఫ్) ఈ స్కూల్ లోనే చదువుకున్నారు” అని మాజీ ఐఏఎస్ మరియు 1971 బ్యాచ్ పూర్వ విద్యార్థి మహమ్మద్ అలీ రఫత్ చెప్పుకొచ్చారు.
పూర్వ విద్యార్ధులు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల చర్చలు జరిపారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు, పాఠశాలలో పదవ తరగతికి చెందిన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మరియు అలియా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చివరి సంవత్సరం విద్యార్థులకు 150 ప్యూర్ సిల్వర్ మెడల్స్ కూడా ప్రదానం చేశారు.
Also Read: హైదరాబాద్ మొదటి “నిజాం” గురించి తెలుసా..? ఆయన కథ ఏంటంటే..?
End of Article