మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల లాభమా..? నష్టమా..? సైన్స్ ఏం చెప్తోంది అంటే..?

మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల లాభమా..? నష్టమా..? సైన్స్ ఏం చెప్తోంది అంటే..?

by kavitha

Ads

సాధారణంగా మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఓ చిన్న కునుకు తియ్యలని చాలామంది అనుకుంటారు. మధ్యాహ్నం సమయంలో నిద్ర లక్షణాలు ఎక్కువగానే ఉంటాయి. అయితే మధ్యాహ్నం పడుకోవడం ఆరోగ్యానికి లాభమా? నష్టమా? అనే సందేహాలు వస్తూ ఉంటాయి.

Video Advertisement

అయితే మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. కానీ కొంత మంది పగలు పడుకోవడం వల్ల రాత్రి పూట నిద్ర రాదేమోనని భావిస్తారు. అయితే అది వారి అపోహ మాత్రమేనని నిపుణులు అంటున్నారు.
మధ్యాహ్నం పూట కొద్దిసేపు నిద్ర పోవడం(పవర్ న్యాప్) వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అధ్యయనాలు చెప్తున్నాయి. దాని వల్ల ఒత్తిడి తగ్గుతుంది స్టామినా, క్రియేటివిటీ, వంటివి పెరుగుతాయి. అందువల్ల కొన్ని కంపెనీలు దీనిని ప్రోత్సాహిస్తున్నాయి. అయితే ఈ పవర్ న్యాప్ అనేది ముప్పై నిముషాల కన్నా ఎక్కువగా ఉండకూడదు. మధ్యాహ్నం నిద్ర వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతే కాకుండా షుగర్, థైరాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.
శరీరంలోని హార్మోన్లు కూడా చురుగ్గా పనిచేస్తాయి. దానివల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుందని, ఒబేసిటీ వంటి ఆరోగ్య సమస్యలను కూడా తేలికగా అధిగమించవచ్చు. ఈ న్యాప్ వల్ల శ‌రీరం పున‌రుత్తేజం అవుతుంది. అలాగే శారీర‌క, మాన‌సిక‌ప‌ర‌మైన ఒత్తిళ్లు దూరం అవుతాయి. ఇటీవల జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం పగలు చిన్నకాసేపు పడుకోవడం వల్ల జ్ఞాప‌క‌శ‌క్తి మెరుగుపడుతుందని తేలింది. బీపీ త‌గ్గుతుందని, గుండె ఆరోగ్యం కూడా మెరుగు అవడంతో పాటుగా హార్మోన్ల స‌మ‌స్య‌లు కూడా తగ్గుతాయి.
అంతే కాకుండా రాత్రి పూట ఆల‌స్యంగా పడుకోవడం వ‌ల్ల క‌లిగే ఒత్తిడిని పగలు కాసేపు కునుకు తీయడం వల్ల తగ్గించ వచ్చు. అయితే 30 నిమిషాల పాటు కునుకు తీయడం వల్ల మరింత ఉత్సాహంగా పని చేస్తారు. కానీ పగలు నిద్ర ముప్పై నిమిషాల కన్నాఎక్కువ అయితే మాత్రం ప్ర‌మాదం. మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన త‌రువాత ముప్పై నిమిషాల కంటే ఎక్కువ‌ సమయం నిద్రించేవారిలో జీవ‌క్రియ దెబ్బ‌తింటుందని పరిశోధనలో తేలింది.

Also Read: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తీసుకుంటే పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయి..

 


End of Article

You may also like