“ఇదేం సినిమారా బాబు..!” అని ట్రోల్ చేసారు… కానీ 80 కోట్లు పోయినా 100 కోట్లు లాభం వచ్చింది..! ఎలాగంటే?

“ఇదేం సినిమారా బాబు..!” అని ట్రోల్ చేసారు… కానీ 80 కోట్లు పోయినా 100 కోట్లు లాభం వచ్చింది..! ఎలాగంటే?

by Anudeep

Ads

అరుళ్‌ శరవణన్ “ది లెజెండ్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్, ట్రైలర్‌, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా అన్నింటి మీద ట్రోలింగ్ జరిగింది. ఆఖరికి జర్నలిస్టుల సమావేశంలో కూడా ఇంత బడ్జెట్ తో సినిమా ఏంటి అన్నట్టుగా ప్రశ్నించారు? ఎట్టకేలకు ‘ది లెజెండ్’.. పాన్ ఇండియా చిత్రం జూలై 28న విడుదలైంది.

Video Advertisement

ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా వస్తుంది అని తెలిసినప్పటి నుండి ట్రోలర్స్ కు మంచి ఫీస్ట్ దొరికినట్టు అయ్యింది. ఎందుకంటే ఇందులో హీరోగా నటిస్తున్న అరుళ్‌ శరవణన్‌ లుక్స్ గురించి, 51 ఏళ్ళ వయసులో హీరోగా చేస్తూ.. రూ.80 కోట్లు బడ్జెట్ పెడుతున్నాడేంటీ.. ఇతను ఏమైనా పిచ్చోడా అన్నట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

అంతేకాకుండా డబ్బుంటే సినిమా హీరో అయిపోవచ్చు అనడానికి ఇది ఉదాహరణ అంటూ, సినిమా గురించి, అరుళ్‌ శరవణన్‌ గురించి విపరీతమైన నెగిటివ్ కామెంట్లు చేశారు. అయితే రూ.80 కోట్లు సినిమాకు పోయాయి అన్నది నిజమే. కానీ అతను రూ.100 కోట్ల లాభం పొందాడు అనే విషయం చాలామందికి తెలీదు. అసలు విషయం ఏంటంటే.. ఇక్కడే మన ఆలోచనలకు ఒక వ్యాపారస్థుడి ఆలోచనకి తేడా ఉంది.

అరుళ్‌ శరవణన్‌ స్టోర్స్‌లో దుస్తులు, బంగారం వంటివి అమ్ముతూ ఉంటారు. దీపావళి, సంక్రాంతి వంటి పండుగలు వచ్చాయి అంటే భారీ మొత్తం ప్రమోషన్స్ కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అరుళ్‌ శరవణన్‌ తో పాటు హీరోయిన్లను తీసుకురావాలి. అందుకే పాన్ ఇండియా లెవెల్లో ఓ సినిమా తీశాడు. ఇందులో అన్నీ వాళ్ళ బ్రాండ్ కాస్ట్యూమ్సే వాడారు..! సినిమా ఆడకపోయినా ఇతని గురించి చాలా పబ్లిసిటీ జరిగింది.

ఇతని వ్యాపారాల గురించి కూడా జనాలకు బాగా తెలిసింది. ఇదే పబ్లిసిటీ అతను ప్రత్యేకంగా చేసుకోవాలి అంటే.. ‘ది లెజెండ్’ సినిమాకి పెట్టిన బడ్జెట్ కంటే కూడా ఎక్కువవుతుంది.  అందుకే.. రూపాయిని సామాన్యుడు చూసే పద్ధతి వేరు.. వ్యాపారస్తుడు చూసే పద్ధతి వేరు అంటారు. మొత్తానికి శరవణన్ కి ఈ సినిమాతో స్వకార్యం, స్వామికార్యం రెండు నెరవేరాయన్న మాట!


End of Article

You may also like