శరీరంలో ఎన్నిరకాల “కొలెస్ట్రాల్” ఉంటాయో మీకు తెలుసా..?

శరీరంలో ఎన్నిరకాల “కొలెస్ట్రాల్” ఉంటాయో మీకు తెలుసా..?

by Sunku Sravan

Ads

మానవ శరీరంలో కొలెస్ట్రాల్స్ అనేవీ రెండు రకాలుగా ఉంటాయి. మంచి చేసేది, హాని కలిగించేది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే చాలామంది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.

Video Advertisement

మంచి కొలెస్ట్రాల్ ని హెచ్ డి ఎల్ అని, చెడు కొలెస్ట్రాల్ ని ఎల్ డి ఎల్ అని పిలుస్తారు. అయితే ఈ మంచి కొలెస్ట్రాల్ మన గుండెకు మేలు చేస్తుంది. ఇది రక్తం నుంచి కొవ్వును తగ్గించడంలో సహకరిస్తోంది. కాబట్టి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..!

ముఖ్యంగా ప్రతిరోజు వ్యాయామం చేయడం చాలా అవసరం. రోజూ అరగంటపాటు తప్పనిసరిగా చేయాలి. జాగింగ్, స్విమ్మింగ్, నడక, పరుగు లేదంటే జిమ్ కు పెళ్లి వ్యాయామం చేయవచ్చు. అలాగే ఫాస్ట్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో చెడు కొలెస్ట్రాల్ పెంచే సంతృప్త కొవ్వులు, ఫ్యాట్ ఉంటాయి. అందుకే ఈ ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే చక్కెర పదార్థాలు కూడా తినడం మానుకోవాలి. ఇందులో ఉండే చక్కెర వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతుంది.

దీనివల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. దీనికి తోడుగా బరువు కూడా తగ్గించుకోవాలి. బరువు పెరిగితే అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బరువు పెరగకూడదు. వీటికి తోడుగా ధూమపానం, మద్యపానం కూడా మంచి కొలెస్ట్రాల్ ను తగ్గించి చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.


End of Article

You may also like