Ads
చేవెళ్ల రవి కుమార్.. ఈ పేరు చెబితే ఎవరికీ పెద్దగా తెలీదు కానీ బిత్తిరి సత్తి అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. మొదట చిన్న చిన్న కామెడీ షోలు చేసుకుంటూ ఉండే సత్తి.. ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతం సత్తితో ఇంటర్వ్యూ కోసం ఎదురు చూసేలా చేసాడు.
Video Advertisement
మీడియా న్యూస్ ఛానల్ లో సరదాగా వార్తలు చెబుతూ ప్రేక్షకులకు దగ్గరైన సత్తి ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతను కొత్తదారిలో భారీ ఆదాయాన్ని అందుకుంటున్నాడు. పెద్ద దర్శకులు, హీరోలు కూడా ప్రస్తుతం బిత్తిరి సత్తి తో సినిమాలను ప్రమోట్ చేకుంటున్నారు. దీంతో ఇప్పుడు బిత్తిరి సత్తికి సీనియర్ యాంకర్ సుమ కనకాల కంటే ఎక్కువ ఆదాయం అందుతున్నట్లు తెలుస్తోంది.
బిత్తిరి సత్తి మీడియా న్యూస్ ఛానల్ లో డిమాండ్‌ను బట్టి మారుతూ వచ్చాడు. ప్రస్తుతం నెలకు 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని అందుకుంటున్నట్టు తెలుస్తోంది. అతను మొదట పని చేసిన మీడియా న్యూస్ ఛానల్ లో వేలల్లో జీతం అందుకున్న సత్తి ఆ తర్వాత మరో ప్రముఖ న్యూస్ ఛానల్ లో నాలుగు లక్షల వరకు ఆదాయాన్ని అందుకున్నాడు.
ఇప్పుడు బిత్తిరి సత్తి ప్రైవేట్ యాడ్స్ కూడా చేస్తున్నాడు. దీని కోసం కూడా అతను ఏకంగా రోజుకు ఆరు లక్షల వరకు డిమాండ్ చేస్తున్నాడట. వరుసగా పెద్ద సినిమాలకు సంబంధించిన స్టార్స్ తో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడంతో బిత్తిరి సత్తికి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో ఒక్కో ఇంటర్వ్యూకు రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. సత్తి సినిమా ఇంటర్వ్యూకు కూడా మంచి క్రేజ్ అందుతుంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా ఇంటర్వ్యూ కూడా బాగా క్లిక్ అయ్యింది.
అందులో ఎన్టీఆర్ తో బిత్తిరి సత్తి అల్లరి మామూలుగా లేదు. ఆ తర్వాత మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాట ఇంటర్వ్యూ కూడా బాగా వైరల్ అయ్యింది. సత్తి తన మాటలతో మహేష్‌ను బాగా నవ్వించాడు. ఆ తర్వాత ఎఫ్3 సినిమా ప్రమోషన్లలో కూడా సత్తి నవ్వులు పూయించాడు. వెంకీ కూడా బిత్తిరిని ఓ ఆట ఆడుకున్నాడు. ఇలా వరుసగా బిత్తిరి సత్తి పెద్ద సినిమాలు, స్టార్ హీరోలతో వరుసగా ఇంటర్వ్యూలు చేస్తూ పెద్ద మొత్తాన్ని అందుకుంటున్నట్టు సమాచారం.
End of Article