సినీ తారల పై ఆడియెన్స్ కి అభిమానం, ప్రేమ ఉంటుంది. సినీ తారల నటన, డ్యాన్స్ నచ్చి అభిమానులు అవుతుంటారు. ఇక తమ ఫేవరెట్ స్టార్స్ కోసం ఫ్యాన్స్ ఏం చేయడానికి అయినా సిద్ధపడుతుంటారు.

Video Advertisement

కొందరు ఫ్యాన్స్ స్టార్స్ పేరు మీద మంచి పనులు చేస్తుంటారు. కొందరు స్టార్స్ పై ఉన్న అభిమానాన్ని తెలపడం కోసం గుడి కడుతుంటారు. అయితే ఇలాంటివి ఎక్కువగా కోలీవుడ్ లో కనిపిస్తుంది. తాజాగా స్టార్ హీరోయిన్ సమంతకి ఒక అభిమాని గుడి కట్టారు. దానికి అయిన ఖర్చు గురించి నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత కొద్ది కాలంలోనే త‌న‌ ప్రతిభతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్ర‌స్తుతం వరుసగా ప్రాజెక్ట్స్  చేస్తూ కెరీర్ లో కొనసాగుతున్నారు. ఆమె పర్సనల్ లైఫ్ లో ఎన్ని ఇబ్బందులు  ఎదురైనా, వాటి ఎఫెక్ట్ తన కెరీర్ పై ప‌డ‌కుండా ఇండస్ట్రీలో రాణిస్తోంది. స‌మంత‌ తన అందం, న‌ట‌నతో స్టార్ హీరోల అంత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తాజాగా స‌మంత‌కు ఒక అభిమాని తన ఇంట్లోనే గుడి కట్టాడు.
సమంత పుట్టినరోజు సందర్బంగా ఏప్రిల్ 28న సమంత గుడిని ప్రారంభించాడు. ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన సందీప్‌ కి  హీరోయిన్ సమంత అంటే ఎంతో అభిమానం. సమంత నటిగా కంటే ఆమె ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలు సందీప్ ను ఎంతగానో ఆక‌ట్టుకున్నాయి. ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలిచాయి. దీంతో సమంత పై అతనికి మరింత అభిమానం పెరిగింది.
ఆ అభిమానంతోనే హీరోయిన్ స‌మంత‌కు తన ఇంట్లోనే గుడి కట్టాడు. సమంత పుట్టినరోజున గ్రాండ్ గా ఆ గుడిని అందరి మధ్య ప్రారంభించాడు. అయితే ఈ గుడి కట్టడం కోసం సందీప్ పెట్టిన ఖ‌ర్చు అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. సుమారు 5-6 లక్షల వరకు ఖర్చు చేసి తన అభిమాన నటి స‌మంత‌కు గుడి క‌ట్టించాడ‌ట‌. ఈ గుడి వీడియో సామాజిక మధ్యమాలలో వైరల్ అవడంతో నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అయితే గుడి బానే ఉంది. కానీ విగ్రహం అలా ఉందేంటి, ఇంతకీ సమంత ఎక్కడ అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: “వాల్తేరు వీరయ్య” నుండి… “విరూపాక్ష” వరకు… 2023 లో ఇప్పటివరకు “హిట్” టాక్ తెచ్చుకున్న 10 సినిమాలు..!