Ads
ప్రస్తుతం మనం చాలా చోట్ల వెరిఫికేషన్ కోసం ఏదైనా ఒక ఐడెంటిటీ డీటెయిల్ సబ్మిట్ చేయాల్సి వస్తోంది. అందులో ఒకటి పాన్ నెంబర్. పాన్ అనేది ఇప్పుడు చాలా మంది దగ్గర ఉంటోంది. ఆధార్ తో పాటు అంత ముఖ్యమైన ఐడెంటిటీ ప్రూఫ్ పాన్ కార్డ్. పాన్ కార్డ్ మీద పది అంకెల ఐడీ ఒకటి ఉంటుంది. అందులో కొన్ని ఆల్ఫాబెట్స్ ఉంటే ఇంకొన్ని డిజిట్స్ ఉంటాయి. ఆ టెన్ డిజిట్స్ ఐడీ ఎలా రూపొందిస్తారో, దాని వెనకాల ఉన్న అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
# పాన్ కార్డ్ నెంబర్ అనేది ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ కాంబినేషన్ లో ఉంటుంది. అంటే డిజిట్స్ ఇంకా ఆల్ఫాబెట్స్ కలిపి ఉండడం అన్నమాట. ఇందులో మొదటి మూడు క్యారెక్టర్స్ AAA నుంచి ZZZ వరకు వచ్చే సిరీస్ రిప్రజెంట్ చేస్తాయి.
# తర్వాత ఉండే నాలుగవ క్యారెక్టర్ పాన్ కార్డ్ యొక్క స్టేటస్ రిప్రజెంట్ చేస్తుంది.
సి (C) అంటే కంపెనీ
పి (P) అంటే పర్సన్
హెచ్ (H) అంటే హెచ్ యు ఎఫ్ హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ
ఎఫ్ (F) అంటే ఫర్మ్ (లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్ షిప్)
ఏ (A) అంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ (AOP)
టి (T) అంటే ట్రస్ట్
బి (B) అంటే బాడీ ఆఫ్ ఇండివిజువల్స్
ఎల్ (L) అంటే లోకల్ అథారిటీ
జె (J) అంటే ఆర్టిఫిషియల్ జుడిషియల్ పర్సన్
జి (G) అంటే గవర్నమెంట్
# పాన్ కార్డు నెంబర్ లో ఉండే ఐదవ క్యారెక్టర్ సర్ నేమ్ లోని మొదటి అక్షరం లేదా ఆ ఎంటిటీ యొక్క పేరులోని మొదటి అక్షరం అయి ఉంటుంది.
# 6 నుండి 9 క్యారెక్టర్ల వరకు 0001 నుండి 9999 వరకు ఉండే సీక్వెన్షియల్ నంబర్స్ ఉంటాయి.
# చివరగా ఉండే ఆల్ఫాబెట్ ముందు ఉన్న తొమ్మిది ఆల్ఫాబెట్స్ ఇంకా నంబర్స్ కి ఒక ఫార్ములా అప్లై చేయడం ద్వారా జనరేట్ అయ్యే ఆల్ఫాబెటిక్ చెక్ డిజిట్.
ఇలా ప్రతి ఒక్కరికీ పాన్ కార్డ్ నెంబర్ జనరేట్ చేస్తారు. మన దేశంలో ప్రస్తుతం 25 కోట్ల కంటే ఎక్కువ మంది పాన్ కార్డ్ హోల్డర్ లు ఉన్నారు.
End of Article