వాట్సాప్ లో వాయిస్ కాల్స్ రికార్డింగ్ ఎలా చేస్తారో మీకు తెలుసా..!!

వాట్సాప్ లో వాయిస్ కాల్స్ రికార్డింగ్ ఎలా చేస్తారో మీకు తెలుసా..!!

by Sunku Sravan

Ads

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన తరుణంలో ప్రతిదీ అరచేతిలో ప్రత్యక్షమవుతుంది. 2g, 3g, 4g,5g నెట్వర్కులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. త్వరలో 6g కూడా రాబోతోంది. ఈ తరుణంలో ప్రతి ఒక్కరు చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది. ఇందులో అనేక యాప్స్ ఉంటాయి. దీంట్లో మనం ప్రతిరోజూ ఉపయోగించేది వాట్సాప్. ఇందులో అనేక ఫీచర్లు కూడా వస్తున్నాయి.గతంతో పోలిస్తే వాట్స్అప్ కాల్స్ మాట్లాడుకోవడం ఎక్కువ అవుతోంది. వాయిస్ కాల్స్ తో పాటుగా వీడియో కాల్స్ కూడా మాట్లాడుకునే సౌకర్యం వాట్సాప్ లో ఉన్నది. లైవ్ లొకేషన్ షేర్ చేయడం, చాట్ చేసుకోవడం, వీడియోలు, ఫోటోలు, ప్రపంచంలో ఉన్న ఎక్కడి వారికైనా పంపడం క్షణాల్లో జరిగిపోతుంది. అయితే మనం స్మార్ట్ ఫోన్ నుంచి కాల్ చేస్తే రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇదే తరుణంలో వాట్సప్ యాప్ లో ఈ సదుపాయం లేదు కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవలసి ఉంటుంది. ముఖ్యమైన విషయాలు మాట్లాడే సమయంలో రికార్డింగ్ చేస్తే అది తర్వాత మనకు ఎంతో ఉపయోగకరంగా ఉండవచ్చు. అయితే మీ దగ్గర 2 స్మార్ట్ ఫోన్లు ఉంటే వాట్సాప్ కాల్ లో స్పీకర్ ఆన్ చేసి దాన్ని రికార్డ్ చేసుకోవచ్చు. మరి ఈ తరుణంలో ఆ విషయాలు ఎవరు వినకూడదు అనుకుంటే సీక్రెట్ ప్లేస్ కి వెళ్లి రికార్డింగ్ చేసుకోవాలి. మనం వీటికోసం థర్డ్ పార్టీ యాప్స్ ను యూస్ చేయడం సురక్షితం కాదు. కాబట్టి గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి అక్కడ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా చేసుకునే ముందు ఆ యాప్ కింద దాన్ని ఉపయోగిస్తున్న యూజర్ల రివ్యూలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని కొంత టైం కేటాయించి చదవాలి. దీనివల్ల ఆ యాప్ సురక్షితమా కాదా అనేది మనకు తెలుస్తుంది. అయితే కాల్ రికార్డింగ్ క్యూబ్ ఏసిఆర్ అనే ఒక యాప్ ఉంది. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుని ఆటోమేటిక్ గా వాట్స్అప్ కాల్స్ ను రికార్డింగ్ చేస్తుంది. అంతేకాకుండా ఫేస్బుక్, టెలిగ్రామ్, స్లాక్, సిగ్నల్ యాప్ ల నుండి చేసుకునేటువంటి కాల్స్ కూడా ఈ యొక్క యాప్ లో రికార్డు అవుతాయి. దీన్ని ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏ యాప్ కు సంబంధించి రికార్డు చేసుకోవాలో తప్పకుండా తెలియజేయాలి.

Video Advertisement


End of Article

You may also like