నందమూరి బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాలలో సమరసింహారెడ్డి చిత్రం ఒకటి. ఫ్యాక్షన్‌ నేపద్యంతో వచ్చిన హై వోల్టేజ్‌ మూవీలో సిస్టర్‌ సెంటిమెంట్‌ అందరిని ఆకట్టుకుంది. సొంత చెల్లెల్లు కాకపోయినా ఇచ్చిన మాట కోసం వారి బాధ్యతలను తీసుకున్న అన్నగా బాలయ్య నటన ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ అక్కాచెల్లెళ్లలో సరస్వతిగా బాలనటి సహస్ర అద్భుతంగా నటించింది.

Video Advertisement

అలాగే బాలయ్యకు ఆ అమ్మాయికి మధ్య వచ్చే సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. అయితే బాలనటి సహస్ర ఈ మూవీ కన్నా ముందు ఎన్నో చిత్రాల్లో నటించింది. రౌడీ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, హిట్లర్‌, మేజర్‌ చంద్రకాంత్‌, సమర సంహారెడ్డి లాంటి సినిమాలలో నటించింది. దాదాపు అగ్ర హీరోలందరితోనూ కలిసి నటించింది. ఆమె నటించిన చివరి చిత్రం సమరసింహ రెడ్డి. ఆ తరువాత చదువు పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో సినిమాలకు స్వస్తి పలికి, ఉన్నత విద్యాభ్యాసం చేసింది. సహస్ర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపింది. Samarasimha-Reddy-Movie-child-artist-Sahasra1 తన తండ్రిది వరంగల్‌ అని, హైదరాబాద్‌ లో  స్థిరపడ్డారని, తను ఏడాదిన్నర వయసు నుండే మాట్లాడేదాన్ని అని తెలిపింది. ఒక పార్టీలో నన్ను చూసి సినిమాలలో ఛాన్స్ ఇచ్చారని తెలిపింది. నాతోపాటు అమ్మ, అమ్మమ్మ షూటింగ్ కు వచ్చేవారు. హీరో భానుచందర్‌ గారు నటించిన ‘ఉద్యమ నా తొలి సినిమా. నేను చిన్నపిల్లను అవడంతో హీరోలంతా నాతో బాగుండేవారు. రామ్‌చరణ్‌ వల్ల ఇంటికి వెళ్లినపుడు టెడ్డీబేర్‌తో ఎక్కువగా ఆడుకునేదాన్ని. చెన్నైలో ఒకసారి షూటింగ్‌కు వెళ్ళిన సమయంలో రామ్‌చరణ్‌ ఉప్మా చేసి పెట్టారని తెలిపింది. అది నా లైఫ్ లో మర్చిపోలేని క్షణాలు.
Samarasimha-Reddy-Movie-child-artist-Sahasra ఇక సమరసింహారెడ్డి సినిమా ఆఖరి రోజు షూటింగ్‌ లో ప్రొడక్షన్‌ టీమ్‌లో ఉన్నవారందరికి వెండి రింగ్స్ ఇచ్చాను.
ఎన్టీఆర్‌ గారు అయితే రండి, కూర్చోండి అని నాతో మాట్లాడేవారు. రెండవ సారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్‌ మీటింగ్‌ ను ఆపి, నాతో భోజనం చేశారు. మేజర్‌ చంద్రకాంత్‌ చిత్రం షూటింగ్‌ సమయంలో మనోజ్‌, నేను కలిసి షూటింగ్ కు వెళ్లేవాళ్లమని చెప్పారు. సమరసింహారెడ్డి సినిమా తరువాత స్టడీస్ మీద దృష్టి పెట్టాలని సినిమాలు చేయడం మానేశాను. నేను మాస్టర్స్‌ ఇన్‌ బయోటెక్నాలజీ చేశాను. ప్రస్తుతం బిజినెస్‌ చేస్తున్నానని తెలిపింది. చెప్పుకొచ్చింది.Samarasimha-Reddy-Movie-child-artist-Sahasra2Also Read: పవన్‌ కళ్యాణ్ గురించి త్రివిక్రమ్ సతీమణి సౌజన్య చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు..