టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పలు సినిమాలు చేశారు. వీరి కాంబోలో జల్సా, అజ్ఞాతవాసి, అత్తారింటికి దారేది చిత్రాలు వచ్చాయి. త్రివిక్రమ్ దర్శకత్వం చేయనప్పటికి, భీమ్లానాయక్ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగులు రాశారు.
Video Advertisement
ఇక పవన్, సాయితేజ్ కలిసి నటిస్తున్న ‘వినోదయ సీతం’ రీమేక్ సినిమాకి కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమే మాటలు రాస్తున్నారు. సినిమాల విషయం పక్కన పెడితే పవర్ స్టార్ పవన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు మంచి స్నేహితులు. ఈ విషయాన్ని వీరిద్దరు కూడా పలుసార్లు తెలియచేసారు. ఈ నేపధ్యంలోనే పవన్ – త్రివిక్రమ్‌ల ఫ్రెండ్ షిప్ గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య శ్రీనివాస్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ మా ఇంటికి వచ్చినపుడు ఇద్దరు కూడా కబుర్లలో పడతారు.
ఇద్దరు పురాణాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారని, అలా మాట్లాడుకుంటూ ప్రపంచాన్ని కూడా మరిచిపోతారని తెలిపింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం చాలా గొప్పదని, ఒకరంటే మరొకరికి అమితమైన గౌరవం అని చెప్పారు. మా వారు తన బుక్స్ ని ఎవరికి కూడా ఇవ్వడానికి ముందుకు రారు. కానీ పవన్ అడిగితే వెంటనే కాదనకుండా ఇస్తారు. ఇక వీరిద్దరు ఒకరికి ఒకరు ఇచ్చుకునే గిఫ్ట్స్ అంటే అవి కూడా బుక్స్, పెన్స్ అని తెలిపారు.
పవన్ కళ్యాణ్ కి మా ఇంట్లో చేసే వంటకాలను చాలా ఇష్టపడుతారు. ఉదయం పూట పవన్ మా ఇంటికి వచ్చినట్లయితే అడిగి మరీ ఉప్మా చేయించుకుని తింటారు. ఇక లంచ్ సమయంలో అయితే శాఖాహార వంటకాలు, ఆవకాయ చాలా ఇష్టంగా తింటారు. రవ్వలడ్డులను కూడా అడిగి తీసుకుంటారు. దానికి పవన్ సిగ్గుపడరు. మా ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోతారని సౌజన్య శ్రీనివాస్ తెలిపారు. ఆమె క్లాసికల్ డ్యాన్సర్. అయితే ఈమధ్యే ప్రొడ్యూసర్ మారి సితార బ్యానర్‌తో కలిసి చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇటీవల కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా వచ్చిన ‘సార్’ సినిమాకు సహ నిర్మాతగా ఉన్నారు.
Also Read: ‘బలగం’ సినిమాకు అంతర్జాతీయ పురస్కారం.. ఇప్పటివరకు ఎన్ని అవార్డులు వచ్చాయంటే..