సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా శివాజి. ఈ చిత్రంలో శ్రియ శరణ్ హీరోయిన్ గా నటించింది. అప్పటి దాకా దక్షిణాదిలో వచ్చిన సినిమాలన్నిటి కన్నా అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా ‘శివాజి’ రికార్డు సృష్టించింది.

Video Advertisement

2007లో జూన్ 15న రిలీజ్ అయిన ఈ మూవీ కోలీవుడ్ లో ఎబౌవ్ యావరేజ్ గా నిలిచింది, అయితే టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ టీవీలో టెలికాస్ట్ అయితే చూసే ప్రేక్షకులు ఉన్నారు. అంతలా తెలుగు ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యింది. రజినికాంత్ మేనమామగా నటించిన వివేక్ ఈ మూవీలో ఏం పని చేసేవారో ఇప్పుడు చూద్దాం..
రజినీకాంత్, శ్రియ జంటగా నటించిన మూవీ శివాజి. డైరెక్టర్ శంకర్ తెరక్కేకించిన ఈ మూవీ తమిళంతో పాటు,  తెలుగులోను ఏకకాలంలో విడుదల అయ్యింది. అయితే తమిళంలో కన్నా, తెలుగులోనే సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సౌత్ లో వంద కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాగా ‘శివాజీ’ అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. రజినికాంత్ లుక్సం, డైలాగ్స్, స్టైల్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఒక ఎన్నారై భారత్ కు వచ్చి, దేశంలో దాచిపెట్టిన బ్లాక్ మనీని ఎలా బయటకు రప్పించాడు. ఆ డబ్బుతో ప్రజలకు ఎలా సాయం చేశాడనే కాన్సెప్ట్ తో ఈ మూవీని శంకర్ తెరకెక్కించారు. సందేశాత్మక కథతో రూపొందిన ఈ మూవీలో రజినికాంత్ ఒక ఎన్నారై పాత్రలో నటించారు.
రజినికాంత్ మేనమామగా పూర్తి నిడివి ఉన్న పాత్రలో వివేక్ నటించారు. అయితే ఈ మూవీని ఇప్పటికే ఎన్నోసార్లు చూసినా కానీ, వివేక్ ఏం జాబ్ చేసేవాడేనే విషయాన్ని ప్రేక్షకులు గమనించలేదు. అయితే ఈ మూవీలో వివేక్ లాయర్ గా నటించాడు. ఈ విషయం తెలిసిన నెటిజెన్లు ఇన్ని సార్లు చూసాం కాని వివేక్ ఏం చేస్తారు అనే విషయం గమనించలేదే అని కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: స్కంద ట్రైలర్‌లో రామ్, శ్రీకాంత్ తో పాటు కనిపించిన… ఈ హీరో ఎవరో తెలుసా..?