Ads
తెలుగు ప్రేక్షకులకు విజయశాంతి పరిచయం అవసరం లేని పేరు. 1980 లో వచ్చిన కళ్లుక్కుల్ ఈరమ్ అనే తమిళ సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టిన విజయశాంతి అదే సంవత్సరం కిలాడి కృష్ణుడు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయం అయ్యారు. 1989 లో వచ్చిన ఈశ్వర్ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టి అప్పట్లోనే స్టార్ హీరోలందరితోను కలిసి నటించారు.
Video Advertisement
అప్పట్లోనే సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విజయశాంతి లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే.. విజయశాంతితో గోపిచంద్ కు అనుబంధం ఎలా ఉందా అని డౌట్ వస్తోందా?
విజయశాంతి అప్పట్లోనే స్టార్ హీరోయిన్ గా కొనసాగడానికి గోపీచంద్ తండ్రి టీ. కృష్ణ ఓ ముఖ్య కారణం. అప్పట్లో ఆయన పాపులర్ డైరెక్టర్ గా ఉండేవారు. విజయశాంతి మంచి కధాంశాలున్న చిత్రాలను ఎంచుకోవడంలో ఆయన ఎంతగానో దోహదం చేసేవారు. ఆయన గైడెన్స్ సాయంతో విజయశాంతి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.
అప్పటి నుంచే ఆమెకు టి.కృష్ణ కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉండేది అని వార్తలు వినిపిస్తున్నాయి. గోపీచంద్ చిన్న వయసులో ఉన్నప్పుడే ఆమె దగ్గరుండి చూసుకునేది అనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. విజయశాంతికి, గోపీచంద్ కు మధ్య ఈ స్నేహం కొనసాగుతూ వస్తోందని చెప్పవచ్చు.
End of Article