సెలెబ్రిటీస్ గురించిన ఏ విషయం అయినా మనకు ఇంటరెస్టింగ్ గానే ఉంటుంది. అందులోను.. ఒక సెలెబ్రిటికి, మరొక సెలెబ్రిటీ కి మధ్య ఉండే బంధుత్వం గురించి అంటే క్యూరియాసిటీ ఉండడం సహజం. అందులోను బాగా పాపులర్ అయిన సెలెబ్రిటీస్ మధ్య రిలేషన్ ఉందంటే తెలుసుకోవడానికి చాలా ఆసక్తి కలుగుతుంటుంది.

Video Advertisement

దర్శక ధీరుడు రాజమౌళికి, హీరో గా విలన్ గా మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబుకి మధ్య బంధుత్వం ఉన్నది అన్న సంగతి చాలా మందికి తెలియదు.

jagapathi 2

వీరిద్దరికి ఏ రిలేషన్ ఉందొ.. ఆ రిలేషన్ ఎలా వచ్చిందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. దర్శక ధీరుడు రాజమౌళి రమా రాజమౌళిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు కార్తికేయ ను దత్తత తీసుకున్నారు. అలాగే.. మరో కూతురుని కూడా దత్తత తీసుకున్నారు.

jagapathi

రాజమౌళి కుమారుడు కార్తికేయ బాహుబలి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసారు. కార్తికేయ జగపతి బాబు సోదరుడు అయిన రామ్ ప్రసాద్ కూతురుని పెళ్లి చేసుకున్నారు. అలా రాజమౌళికి, జగపతి బాబుకి మధ్య వియ్యంకుల బంధుత్వం కలిసిందన్న మాట.

jagapathi 1

జగపతి బాబు ఎంత అద్భుతంగా విలన్ గా నటన కనబరిచినా సరే.. రాజమౌళి మాత్రం ఆయన సినిమాలలో విలన్ గా తీసుకోరు. ఈ విషయమై ఓ సారి జగపతి బాబు ఓ ఇంటర్వ్యూ లో సమాధానం చెప్పారు. మీరు అందంగా ఉండడం వల్లో.. లేక మీ మంచితనం వల్లో విలన్ గా పెట్టుకోలేకపోతున్నానని రాజమౌళి ఓ సారి జగపతి బాబుతో చెప్పుకొచ్చారట.