ఎన్టీఆర్ “శివుడి” పాత్రలో నటించినప్పుడు జరిగిన… ఈ అరుదైన సంఘటన గురించి తెలుసా..?

ఎన్టీఆర్ “శివుడి” పాత్రలో నటించినప్పుడు జరిగిన… ఈ అరుదైన సంఘటన గురించి తెలుసా..?

by kavitha

Ads

వెండితెరపై రాముడు, కృష్ణుడు లాంటి పాత్రలలో ఆయన నటిస్తేనే ఆ క్యారెక్టర్స్ కి నిండుదనం వస్తుంది. ఆయన పేరు వినగానే తెలుగు వారికి ఆ పాత్రలే కళ్ళ ముందు కనిపిస్తాయి.

Video Advertisement

తెలుగు సినీ పరిశ్రమలో పౌరాణిక పాత్రల గురించి మాట్లాడినపుడు గుర్తుకు వచ్చే యాక్టర్స్ తక్కువగానే ఉన్నారు. అయితే పౌరాణిక చిత్రాలంటే గుర్తుకొచ్చేది ఎన్టీఆర్ పేరే. అయితే ఎన్టీఆర్ ఒక చిత్రంలో శివుడు పాత్రలో నటించే సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిందట. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
లెజెండరీ దర్శకుడు కె వి రెడ్డి డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఒక చిత్రంలో శివుడిగా నటించారు. దర్శకుడు సింగీతం శ్రీనివాస్ ఆ సమయంలో ఈ చిత్రానికి  అసిస్టెంట్ డైరెక్టర్. పరమశివుడి క్యారెక్టర్ చేసేటపుడు శివుడి మెడలో నాగుపాము కూడా ఉండాలి. నాగుపాము కోసం అప్పట్లో రబ్బర్ పాములను కొందరు ఉపయోగించేవారు. మరికొందరు కోరలు తీసిన పాములను షూటింగ్ కోసం వాడేవారు. ఎన్టీఆర్ కి రబ్బర్ పామును వాడడం వల్ల ఎలర్జీ రావడంతో ఈ మూవీ షూటింగ్ లో కోరలు లేని పామును ఉపయోగించారు.
సన్నివేశాన్ని షూట్ చేసే ముందు పాములను ఆడించే అతను ఆ పాముకి ట్రైనింగ్ ఇచ్చేవారు. ఈ క్రమంలోనే   పాముకి ట్రైనింగ్ ఇవ్వడం చూసిన ఎన్టీఆర్, అతన్ని ఏమి చేస్తున్నారని ప్రశ్నించారంట. దానికి సింగీతం శ్రీనివాస్ పాము మెడలోకి వెళ్ళేలా ట్రైనింగ్ ఇస్తున్నారని అన్నారంట. అప్పుడు ఎన్టీఆర్ “అలాంటిది ఏమి అవసరం లేదు. వారిని వదిలిపెట్టండి. మెడలోకి ఆయనే వస్తారు” అని అన్నారంట. ఎన్టీఆర్ అలా అనగానే దర్శకుడు కె వి రెడ్డి “ఆయనికి బ్రెయిన్ ఉందని, పాముకి కూడా బ్రెయిన్ ఉంటదని భావిస్తున్నాడా ” అని అన్నారంట.ఈ సన్నివేశం మొదలై, వెనకాల సౌండ్ స్టార్ట్ కాగానే ఆ పాము నెమ్మదిగా వెళ్లి ఎన్టీఆర్ మెడకి చుట్టుకుని ఆభరణంలా  కనిపించిందంట. ఆ దృశ్యాన్ని చూసిన కె వి రెడ్డి, “రామారావు నువ్వు చాలా గొప్పవాడివి, అంతకుమించిన వాడివి” అంటూ దణ్ణం పెట్టారంట. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇది ఇలా ఉండగా ఈ సంవత్సరం ఎన్టీఆర్ 100వ పుట్టినరోజు సందర్భంగా శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ గత ఏడాది మే 28 నుండి శత జయంతి ఉత్సవాలను ప్రారంభించాడు.

Also Read: RAMABANAM REVIEW : “గోపీచంద్” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like