• చిత్రం : రామబాణం
  • నటీనటులు : గోపీచంద్, డింపుల్ హయాతి, జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడేకర్, వెన్నెల కిషోర్
  • నిర్మాత : టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల
  • దర్శకత్వం : శ్రీవాస్
  • సంగీతం : మిక్కీ జే మేయర్
  • విడుదల తేదీ : మే 5, 2023

rama banam movie -story-review-rating

Video Advertisement

స్టోరీ :

ఈస్ట్ గోదావరి రఘుదేవపురంలో విలువలు, నియమాలతో బ్రతికే ఒక అందమైన ఉమ్మడి కుటుంబం. అయితే హీరో విక్కీ (గోపి చంద్) తన అన్న (జగపతి బాబు) తో గొడవ పడి చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. కోల్‌కతా వెళ్లి అక్కడ పెద్ద డాన్ గా మారతాడు. అక్కడే భైరవి (డింపుల్ హయాతి) అనే యూట్యూబర్ ని ప్రేమిస్తాడు.

rama banam movie -story-review-rating

అయితే తన అన్నకి ఒక సమస్య వచ్చిందని తెలుసుకున్న విక్కీ తన ఇంటికి తిరిగి వస్తాడు. ఆ సమస్యల నుండి విక్కీ అన్నని ఎలా బయటపడేసాడు? అన్నదమ్ములు మళ్లీ కలిసారా? అసలు వాళ్ళకి ఉన్న సమస్య ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే..

రివ్యూ:

మ్యాచో హీరో గోపీచంద్ కు లక్ష్యం, లౌక్యం వంటి హిట్ చిత్రాలు అందించిన దర్శకుడు శ్రీవాస్. తాజాగా ఆయన దర్శకత్వంలో గోపీచంద్ మూడోసారి హీరోగా నటించిన చిత్రం రామబాణం. నందమూరి నటిసింహం బాలకృష్ణ చెప్పిన టైటిల్ తో వస్తున్న ఈ మూవీ ట్రైలర్, టీజర్, సాంగ్స్, పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

rama banam movie -story-review-rating

అయితే కథ పాతదే అయినా..కొత్తగా చూపించాడు డైరెక్టర్ శ్రీవాస్. ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు కామెడీ, యాక్ష‌న్ స‌మ‌పాళ్ల‌లో ఉన్నాయి. అలాగే ఎమోషన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్ అయ్యేలా చేశారు.

rama banam movie -story-review-rating

నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. పాటలు బాగున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. లక్ష్యం తర్వాత జగపతి బాబు, గోపీచంద్ మరోసారి అన్నదమ్ములుగా నటించారు. వీరి బంధం బాగా చూపించారు. మిక్కీ జె మేయర్ బీజీఎమ్ యాక్షన్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది .పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి . సినిమాటోగ్రఫీ బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

  • యాక్షన్ ఎపిసోడ్స్
  • న‌టీన‌టులు
  • బాక్గ్రౌండ్ మ్యూజిక్

rama banam movie -story-review-rating

మైనస్ పాయింట్స్:

  • తెలిసిన కథ
  • సాగదీసినట్టుగా ఉండే కొన్ని సీన్స్

రేటింగ్ : 

3/5

rama banam movie -story-review-rating

ట్యాగ్ లైన్ :

(రొటీన్ ) రొమాన్స్, కామెడీ, డ్రామా అన్ని కలగలిపిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్