Ads
మనలో చాలా మందికి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యే ఉంటాయి. ట్రాఫిక్ లో ఎప్పుడో ఒకసారి చిరాకుకి గురయ్యే ఉంటాం.
Video Advertisement
ట్రాఫిక్ రూల్స్ గురించి అందరికీ అవగాహన ఉందిలే కానీ, కొన్ని రూల్స్ గురించి అంత పెద్దగా తెలియకపోవచ్చు. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం ఇప్పుడు మనం అలా కొన్ని తెలియని ట్రాఫిక్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం.
# చెప్పులు (స్లిప్పర్స్), లేదా ఫ్లోటర్ లతో బండి నడిపితే 1000 రూపాయల పెనాల్టీ వేస్తారు. ఎందుకంటే అటువంటి పాదరక్షలు ధరించినప్పుడు పట్టు తక్కువ ఉండటం కారణంగా కాలు జారిపోయే అవకాశాలు ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా గేర్ మార్చేటప్పుడు కాలు స్లిప్ అయ్యి, ప్రమాదాలకు దారి తీస్తూ ఉంటాయి. అందుకే ఈ సారి మీరు మీ వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు బూట్లు ధరించండి.
# ఒకవేళ మీకు రెండు డ్రైవింగ్ లైసెన్స్ లు ఉంటే మీరు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఒకవేళ వేర్వేరు రాష్ట్రాలకు చెందిన రెండు డ్రైవింగ్ లైసెన్స్ లు ఉంటే అప్పుడు చలాన్ కడితే సరిపోతుంది. అక్టోబర్ 2019 నుండి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఆర్సిల డిజైన్ రంగు ఒకేలా ఉండాలి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ మీ డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగుస్తుంటే రెన్యూ చేయించడం మర్చిపోకండి.
# 2020 లో వచ్చిన నిబంధనల ప్రకారం వెహికల్ నడిపే వారు కేవలం రూట్ నావిగేషన్ కోసం మాత్రమే మొబైల్ ఉపయోగించాలి. అది కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు వారి ఏకాగ్రతకు భంగం కలిగించకూడదు. ఒకవేళ డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్లో మాట్లాడితే 5000 రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
# అంబులెన్స్ కానీ, అగ్నిమాపక దళాలు వంటి అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలు వెళ్తున్నప్పుడు ఆ వాహనాలకి దారి కల్పించడం అనేది ఒక తోటి వాహనదారుడి బాధ్యత. ఒకవేళ అలా అంబులెన్స్ కానీ ఫైర్ ఇంజన్ వెహికల్ కానీ వెళ్తున్నప్పుడు వాటికి దారి ఇవ్వకపోతే 10,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుంది లేదా 6 నెలల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.
# ఒకవేళ ఒక వాహనదారుడు మానసికంగా కానీ శారీరకంగా కానీ వాహనాలు నడపడానికి అనర్హులుగా గుర్తించబడితే వారికి మొదటి సారి 1000 రూపాయల జరిమానా విధించబడుతుంది. ఒకవేళ వారు రెండోసారి కూడా దోషిగా గుర్తించబడితే 2000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
ఈసారి మీరు కూడా రోడ్డు మీద వెహికల్ నడిపేటప్పుడు ఈ జాగ్రత్తలను దృష్టిలో పెట్టుకోండి.
End of Article