అంత్యక్రియల అనంతరం వెనక్కి తిరిగి చూడకుండా రావాలని చెప్తారు..! ఎందుకో తెలుసా..?

అంత్యక్రియల అనంతరం వెనక్కి తిరిగి చూడకుండా రావాలని చెప్తారు..! ఎందుకో తెలుసా..?

by kavitha

Ads

హిందు సంప్రదాయంలో ఆచారాలు, ధర్మాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిలో అన్నింటిని పాటించకపోయినా, కొన్నింటిని మాత్రం అందరు తప్పనిసరిగా  పాటిస్తుంటారు. అలాంటివాటిలో కొన్ని పనులు చేసి వస్తున్నప్పుడు లేదా కొన్ని గుడులకు వెళ్లినప్పుడు అక్కడి నుండి వచ్చేప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా వస్తారు. వాటిలో ఒకటి అంత్యక్రియలు.

Video Advertisement

ఎవరైనా మరణించినపుడు అది ఇంట్లో వారు కానీ, తెలిసినవారి అంత్యక్రియల అనంతరం వెనక్కి తిరిగి చూడకుండా రావాలని అంటారు. అలాగే చేస్తారు. అయితే ఎందుకు వెనక్కి తిరిగి చూడకూడదు?  చూస్తే ఏం అవుతుందనేది ఇప్పుడు చూద్దాం..
హిందు సనాతన ధర్మంలో మనిషి మృతికి సంబంధించి ఎన్నో నియమాలు ఉన్నాయి. దహన సంస్కారాలు లేదా అంత్యక్రియలకు వెళ్ళిన అనంతరం చేయాల్సిన మరియు చేయకూడని ప‌నుల గురించి పేర్కొన్నారు. ప్రజలు తమ ప్రయోజనం మరియు  క్షేమం కోసం పాటించాల్సిన పదహారు సంస్కారాలను సనాతన ధర్మంలో వివరించారు. వీటిలో ఒకటి మనిషి చనిపోయిన తరువాత చేసే కార్య‌క్ర‌మానికి సంబంధించినది.
ఒక మనిషి మరణం తరువాత అంతిమ సంస్కారాలు, ఆచారాలు పూర్తి అయిన తర్వాత ఆత్మ వెళ్ళి దైవంలో కలిసి పోతుంది. తద్వారా ఆ ఆత్మకి ఈ లోకంతో ఉన్న సంబంధాలు అన్ని తొల‌గిపోతాయి. గరుడ పురాణంలో అంత్యక్రియలు, ఆత్మ మరణానంతర జీవితం గురించి వివరించారు. గరుడ పురాణం ప్రకారంగా అంత్యక్రియల తరువాత మనిషి తిరిగి వస్తున్నప్పుడు అసలు వెనక్కి తిరిగి చూడకూడదు.
ఒకవేళ అలా చూసినట్లయితే చనిపోయిన వ్యక్తి ఆత్మ చూసిన వారితో ప్రేమలో పడుతుందట. తన మరణం వల్ల ఆ వ్యక్తి ఒక్కరే బాధ పడుతున్నాడని ఆత్మ భావిస్తుందట. అలాంటి స్థితిలో ఆ ఆత్మకు శాంతి కలగదు. ఆత్మ ఆ వ్య‌క్తితో అనుబంధాన్నిపెంచుకుని, తనతో పాటు ఇంటికి వెళ్లాలని భావిస్తుందంట. ఈ కారణం వల్లనే అంత్యక్రియల అనంతరం వెనక్కి తిరిగి చూడకుండా రావాలని అంటారు.

Also Read: మూలా నక్షత్రంలో పుట్టిన స్త్రీని పెళ్లి చేసుకోకూడదా..? చేసుకుంటే ఏమవుతుంది అంటే..?

 


End of Article

You may also like