పెళ్ళయిన కొత్తలో భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు చాలా ప్రేమ కురిపిస్తారు. ఒకరంటే ఒకరు విడిచి ఉండలేనంత కేరింగ్ తీసుకుంటారు. ఇష్టాయిష్టాలను తెలుసుకొని భాగస్వామి మెప్పు పొందాలని ప్రయత్నిస్తారు.

Video Advertisement

అలాగే ఒకరికి ఒకరు సమయం వెచ్చిస్తూ అనేక విషయాలు సరదాగా చర్చించుకుంటారు. కానీ కొన్నిసార్లు సరదాగా మాట్లాడినవే సీరియస్ అవుతుంటాయి. అందుకే మీ భాగస్వామి దగ్గర కొన్ని విషయాలు ఎప్పటికి మాట్లాడకూడదు అవేంటంటే . .

1. పాత స్నేహాల గురించి మాట్లాడడం: 


మీకు గతంలో ఉండే స్నేహాల గురించి, పరిచయాల గురించి అతిగా మాట్లాడకూడదు. ఒక్కోసారి అది మీ క్యారెక్టర్ పై నెగటివ్ ప్రభావాన్ని చూపించొచ్చు.

2. కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం: 


ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ భాగస్వామి దగ్గర వారి కుటుంబ సభ్యుల గురించి తక్కువ చేసి మాట్లాడడం గాని, చెడుగా మాట్లాడడం గాని చేయకూడదు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య అనవసరమైన గొడవల ప్రారంభమవుతాయి.

3. ఇతరులతో పోల్చవద్దు:


మీ భార్యను లేదా భర్తను ఇతరులతో అస్సలు పోల్చకూడదు. దీనివలన వారిలో అసూయ, ఈర్ష, కోపం పెరిగిపోతాయి.

4. పాత గొడవలు వదిలేయాలి:


భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు వదిలేయాలి కానీ వాటిని తవ్వుతూ మరింత పెద్దవి చేసుకోకూడదు.

5. చెడు అలవాట్లను మానేయండి:


గతంలో మీకు స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి చెడు అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానేయండి. అంతేకానీ వాటి గురించి మీ భాగస్వామి వద్ద చర్చించొద్దు.

6. ఆర్థిక సమస్యలు:


మీ ఆర్థిక సమస్యలకు మీ భాగస్వామిని బాధ్యులను చేయకండి. అవి మీ అంతట మీరే పరిష్కరించుకోండి.

7. లోపాలను ఎత్తిచూపొద్దు:

అదే పనిగా మీ భాగస్వామిలోని లోపాలను ఎత్తి చూపడం మంచిది కాదు. పై విషయాలన్నీ పాటించడం ద్వారా ఆలుమగలు ఎలాంటి మనస్పర్థలు లేకుండా ఆనందంగా జీవించొచ్చు.