శ్రీదేవి వలన ఆగిపోయిన చిరంజీవి సినిమాలు ఉన్నాయని తెలుసా ! ఎందుకు నిలిచిపోయాయంటే ?

శ్రీదేవి వలన ఆగిపోయిన చిరంజీవి సినిమాలు ఉన్నాయని తెలుసా ! ఎందుకు నిలిచిపోయాయంటే ?

by Anudeep

సినీ పరిశ్రమలో ఎవరి సపోర్టు లేకుండా ఎదిగిన వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. 1978 పునాదిరాళ్ళు చిత్రంతో ఆయన సినీ కెరియర్ కి పునాది వేసుకుని, ప్రేక్షకుల మదిలో మెగాస్టార్ గా నిలిచారు చిరంజీవి. ఆయన కెరీయర్ లో ప్లాప్స్ కన్నా హిట్స్ ఎక్కువ అని చెప్పవచ్చు.

Video Advertisement

150 కి పైగా చిత్రాలలో నటించారు చిరంజీవి. ఇప్పటికి కూడా టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరు అంటే మన మెగాస్టార్ చిరంజీవి అంటారు సినిమా ఇండస్ట్రీ. చిరంజీవి తన సినీ జీవితంలో ఎంతో మంది హీరోయిన్స్ తో జతకట్టి ఎన్నో సూపర్ హిట్ ని అందుకున్నారు. అయితే చిరంజీవి జత కట్టిన హీరోయిన్ లో ఒక హీరోయిన్ ఆయనను ఎంతో ఇబ్బంది పెట్టింది. ఆ హీరోయిన్ వల్లే ఆయన చేయవలసిన రెండు సినిమాలు ఆగిపోయాయి.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు మన అతిలోక సుందరి శ్రీదేవి. 1980 దశాబ్దంలో చిరంజీవి సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్  హీరోగా కొనసాగుతున్న సమయమది.  అయితే అదే సమయంలో శ్రీదేవి కూడా టాలీవుడ్, బాలీవుడ్ లోను సక్సెస్ పొందుతూ అగ్రస్థాయి కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. వీళ్లిద్దరూ  రాణికాసుల రంగమ్మ, జగదేకవీరుడు అతిలోకసుందరి, ఎస్పి పరశురాం సినిమాల్లో కలిసి నటించారు. ఈ చిత్రాలకు ముందు శ్రీదేవిని చిరంజీవిని కలిసిన నటింపజేయడానికి నిర్మాతలు శ్రీదేవిని సంప్రదిస్తే అనేక రూల్స్ తో వాళ్ళని ఇబ్బంది పెట్టేదట. తను చేసే పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి అంటూ ప్రొడ్యూసర్ ని ముప్పుతిప్పలు పెట్టేదట.

movies that did not happened in Chiranjeevi and sridevi combination

మరి ఇప్పుడు శ్రీదేవి వల్ల ఆగిపోయిన ఆ రెండు చిత్ర విశేషాలను తెలుసుకుందాం..

అందులో ఒకటి వజ్రాలదొంగ A.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సినిమా తీయడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. దాని కోసం దర్శకుడు శ్రీదేవి సంప్రదించగా, ఆ చిత్రానికి నినే నిర్మాతగా బాధ్యతలు చేపడతాను. ఈ చిత్రానికి ఈ నినే నిర్మాతను కాబట్టి హీరో పాత్ర కన్నా, నా పాత్ర ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి అని రూల్స్ పెట్టిందట శ్రీదేవి. శ్రీదేవి  పెట్టిన కండిషన్ కి చిరంజీవి ఒప్పుకోకపోవడంతో ఆ చిత్రాన్ని నిలిపివేయడం జరిగింది.

Kondavitidonga

మళ్లీ A. కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలోనే కొండవీటిదొంగ చిత్రనికి గాను శ్రీదేవి సంప్రదించగా, కథ అంతా విన్న శ్రీదేవి టైటిల్ మార్చమని రూల్ పెట్టిందట. కొండవీటి రాణి కొండవీటిదొంగ అని పెట్టమని చెప్పడంతో, చిరంజీవి కోపం వచ్చి  ఈ సినిమా కూడా ఆగిపోయింది. మరల ఇదే కొండవీటిదొంగ సినిమా రెండు సంవత్సరాల తర్వాత హీరోయిన్ విజయశాంతి, రాధ తో కలిసి చిత్రీకరించారు దర్శకనిర్మాతలు.

movies that did not happened in Chiranjeevi and sridevi combination

కొండవీట దొంగ వచ్చిన రెండు నెలల తర్వాత జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో కూడా శ్రీదేవి తన కండిషన్స్ ని పెట్టింది. ముందుగా ఈ చిత్రానికి గాను జగదేకవీరుడు అని పేరు పెట్టగా, దానికి కూడా శ్రీదేవి కండిషన్స్ అప్లై చేసిందట. చేసేదేమీలేక దర్శకనిర్మాతలు జగదేకవీరుడు అనే టైటిల్ కి అతిలోక సుందరి అని కలిపి ప్రేక్షకుల ముందుకు జగదేకవీరుడు అతిలోకసుందరి అని విడుదల చేశారు. ఈ విధంగా మొదటి రెండు సినిమాలు శ్రీదేవి వల్ల ఆగిపోయాయి.


You may also like