మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆరు పదుల వయసు  దాటిన ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ, వరుస సినిమాలలో నటిస్తున్నారు. చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Video Advertisement

Megastar chiranjeevi and Radhika Movies

Megastar chiranjeevi and Radhika Movies

megastar chiranjeevi images

megastar chiranjeevi images

Chiranjeevi in acharya

Chiranjeevi in acharya

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా చిరంజీవి తన కృషి, పట్టుదలతో అంచలంచెలుగా ఎదిగారు. చిరంజీవితో ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్స్ నటించారు. అయితే ఒక స్టార్ హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవి చెంప దెబ్బ కొట్టిందంట. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా పాపులారిటీ పొందారు. ఆయన నటన, డాన్స్ తో పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అలరిస్తూ ఉంటారు. స్వయంకృషితో మెగాస్టార్ ఎదిగి, చిరంజీవి చాలా మందికి ఆదర్శంగా నిలిచారు. ఇప్పటివరకు ఆయన 154 చిత్రాలలో నటించి అలరించారు. ఆయన కెరీర్ లో ఎంతోమంది కథానాయకలతో నటించారు.

అప్పట్లో ఉన్నఅగ్ర హీరోయిన్స్ అందరితో చిరంజీవి ఆడి, పాడారు.వీరిలో హీరోయిన్ రాధిక ఒకరు. చిరంజీవి, రాధిక కలిసి దాదాపు 25 సినిమాలలో నటించారు. వీరిద్దరి మధ్య స్నేహ బంధం ఉంది. రాధిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 1981లో ‘న్యాయం కావాలి’ మూవీలో చిరంజీవి పక్కన నటించానని, అదే మొదటి సినిమా అని చెప్పారు. ఆ మూవీలో చిరును చెంపదెబ్బ కొట్టే సీన్ లో నటించాల్సి వచ్చిందని అన్నారు.

అయితే ఆమె ఆ సన్నివేశంలో భాగంగా చిరంజీవిని 24 సార్లు చెంపదెబ్బ కొట్టిందట. ఆమెకు తెలుగు సరిగా అర్థం కాకపోవడంతో ఆ సీన్ ను  24 సార్లు రీటేక్ చేయాల్సి వచ్చింది. చివరికి దర్శకుడు అరవడంతో గట్టిగా కొట్టానని, అప్పుడు ఆ సీన్ కు దర్శకుడు ఆమోదం తెలిపాడని, అయితే అప్పటికే చిరంజీవి చెంపలు ఎర్రగా మారాయి. ఆ షాట్ ఓకే అయిన తరువాత రాధిక అలా జరిగినందుకు చాలా బాధపడ్డారట. వెంటనే చిరంజీవి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పిందట. అలా అప్పటినుంచి వీరిద్దరు మంచి స్నేహితులుగా మారరట. ఇప్పటికీ వారి మధ్య ఉన్న స్నేహం అలాగే కొనసాగుతోంది.

Also Read: “ఇంత పెద్ద పొరపాటు ఎలా చేశారు..? చూసుకోవాలి కదా..?” అంటూ… “స్కంద” సినిమాపై కామెంట్స్..!