యువ నటుడు అఖిల్ అక్కినేని హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఏజెంట్’. ఈ మూవీని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు.

Video Advertisement

తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అఖిల్ లుక్ హాలీవుడ్ హీరోలా కనిపించాడు. నిర్మాత ఖర్చుకు వెనుకాడకుండా రూ.80 కోట్లతో అఖిల్ కెరీర్లో బిగ్ బడ్జెట్ సినిమాగా తీర్చిదిద్దాడు. ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో నటించారు. అయితే ఈ పాత్రకి ముందుగా అనుకున్నది మమ్ముట్టిని కాదంట. మరి ఏ స్టార్ హీరోను అనుకున్నారో ఇప్పుడు చూద్దాం..
మూవీ ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్, ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ లెవల్ లో వ్యూస్ నమోదు చేశాయి. పాటల్లో ‘వైల్డ్ సాలా’ పాట ఆకర్షణగా నిలిచింది. ఇక ట్రైలర్ హాలీవుడ్ చిత్రాలను తలపించింది. అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన స్పై ఎంటర్ టైనర్ చిత్రం ఏజెంట్. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదల అయ్యింది. అఖిల్ కెరీర్లోనే ఈ చిత్రానికి అత్యధిక థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. తన లుక్ ను కూడా మార్చుకుని సిక్స్ ప్యాక్ తో కనిపిస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం చాలా శ్రమించాడని తెలుస్తోంది. మమ్ముట్టి క్యారెక్టర్ ఈ సినిమాకి హైలెట్ అని టాక్. సాధారణంగా వేరే ఇండస్ట్రీల హీరోలు తెలుగు సినిమాలలో నటించినపుడు వారికి వేరేవారు డబ్బింగ్ చెప్తుంటారు. కానీ ఈ చిత్రంలో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పారని తెలుస్తోంది. గతంలో కూడా మమ్ముట్టి  ‘యాత్ర’ మూవీకి ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇక ఏజెంట్ కోసం మమ్ముట్టి మరోసారి తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నట్లుగా సమాచారం.
మమ్ముట్టి క్యారెక్టర్ బాగుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో మమ్ముట్టి పాత్రకు ముందుగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను తీసుకోవాలని మేకర్స్ భావించారంట. కానీ చివరికి మమ్ముట్టికి స్టోరీ చెప్పడం ఆయన వెంటనే అంగీకరించడం జరిగిందని తెలుస్తోంది.

Also Read: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ కూతురు..బెల్లంకొండ హీరోతోనే..!