సాధారణంగా హీరోయిన్లు కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగిన తరువాత అవకాశాలు తగ్గడం వల్లనో లేదా పెళ్లి చేసుకోవడం వల్లనో మరే ఇతర కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరం అవుతుంటారు. అలా దూరం అయిన హీరోయిన్స్ లో కొందరు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి బిజీగా మారినవారు ఉన్నారు.

Video Advertisement

కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఇండస్ట్రీ దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ను ఆస్వాదిస్తున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ రవళి ఒకరు. మరి ఆమె ప్రస్తుతం ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..
హీరోయిన్ రవళి ఈ తరం ఆడియెన్స్ కి అంతగా తెలియయకపోవచ్చు. కానీ 90 ల ప్రేక్షకులకు రవళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలీబాబా అరడజను దొంగలు సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవళి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. రియల్ హీరో, వినోదం, శుభాకాంక్షలు, పెళ్లి సందడి లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి, తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన నందమూరి సూపర్ స్టార్ కృష్ణ, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, జగపతి బాబు, శ్రీకాంత్ వంటి టాప్ హీరోలతో నటించి మెప్పించింది. టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్‌గా ఒక  వెలుగు వెలిగారు. ఆమె తెలుగులో మాత్రమే కాకుండా మలయాళం, కన్నడ, తమిళం, హిందీ భాషల చిత్రాలలో నటించింది. ఆమె కెరీర్ లో 40కి పైగా చిత్రాలలో నటించింది. రవళి చివరగా మాయగాడు అనే చిత్రంలో నటించింది.
2007లో రవళి నీలి కృష్ణ అనే వ్యక్తిని వివాహం చేసుకుని యాక్టింగ్ గుడ్ బై చెప్పింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు.  బుల్లితెర నటి హరిత రవళికి సొంత సిస్టర్. ఇదిలా ఉంటే, వివాహం తరువాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రవళి ఆ మధ్యన తిరుపతిలో కనిపించారు.
అలాగే ఒక యూట్యూబ్ ఛానెల్ లో హరితతో పాటు కనిపించారు. అయితే రవళి ప్రస్తుతం ఎంతగానో మారిపోయింది. లేటెస్ట్ వీడియోలో చూసిన వారు ఒకప్పటి తమ ఫేవరేట్ హీరోయిన్ అయిన రవళి ఇలా అయ్యిందేంటి అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కానీ, ఇన్ని సంవత్సరాల తరువాత అయినా రవళిని మళ్లీ చూసినందుకు సంతోషంగా ఉందని అంటున్నారు.

Also Read: “నరేష్-పవిత్ర లోకేష్‌” పై కార్తీకదీపం సౌందర్య కామెంట్స్..! ఏం జరిగిందంటే..?