“నరేష్-పవిత్ర లోకేష్‌” పై కార్తీకదీపం సౌందర్య కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

“నరేష్-పవిత్ర లోకేష్‌” పై కార్తీకదీపం సౌందర్య కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

by kavitha

Ads

బుల్లితెర సీరియల్ కార్తీకదీపం ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సీరియల్‌ ద్వారా పాపులర్ అయినవారిలో అర్చన అనంత్ ఒకరు. సౌందర్య పాత్రలో హీరో డాక్టర్ బాబుకి అమ్మగా, వంటలక్కకి అత్తగారిగా అద్భుతమైన యాక్టింగ్ తో ఆకట్టుకుంది.

Video Advertisement

కార్తీకదీపం సౌందర్యగా బాగా పాపులర్ అయిన ఆమె ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. హీరో, థాంక్యూ బ్రదర్ చిత్రాలలో నటించిన అర్చన, ‘మాటరాని మౌనమిది’ అనే మూవీలో హీరో తల్లిగా నటించింది. తాజాగా ఆమె  ‘మళ్లీ పెళ్లి’ సినిమా జంట నరేష్, పవిత్ర లోకేష్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఆ కామెంట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సమయం కథనం ప్రకారం, నరేష్-పవిత్ర లోకేష్‌ లు తాజాగా నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. వీరిద్దరు ఈ సినిమా ప్రమోషన్స్ పాల్గొంటూ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక ఆ ప్రమోషన్స్ లో వీరిద్దరి ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తున్నారు. దీని పై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇక వీరి కథతోనే ‘మళ్లీ పెళ్లి’‌ చిత్రాన్ని రూపొందించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ట్రైలర్ చూస్తే వారి స్టోరీ అని అర్ధం అవుతోంది. ప్రమోషన్స్ లో నరేష్-పవిత్ర లోకేష్‌ చేసే విన్యాసాలను చూసి కొందరు నవ్వు కుంటుండగా, కొందరు తిట్టుకుంటున్నారు. ఇక కొందరు ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ చిత్రం మే 26 న థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది. ఇదిలా ఉంటే కార్తీకదీపం సౌందర్య ప్రస్తుతం టాలీవుడ్ లో  హాట్ టాపిక్‌గా మారిన నరేష్-పవిత్ర లోకేష్‌ల బంధాన్ని సమర్దిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘వాళ్ళిద్దరూ ఒకరినికొరు ఇష్టపడ్డారని, ఎవరి ఇష్టం వాళ్లదని, ఒక్కో వ్యక్తి మీద ఇష్టం కలగడం, ఇష్టపడడం అనేది వారి పర్సనల్ విషయమని అన్నారు. ఆ విషయంలో తల్లిదండ్రులకూ సంబంధం ఉండదని, వ్యక్తిగతంగా ఇష్టపడిన వారిని ఎవరు ఆపలేరని, అయితే వారిని చూసేవారికి అది కరెక్ట్ అనిపించకపోవచ్చు.
కానీ వారి పై వాక్యాలు చేసే హక్కు చూసేవారికి ఉండదని అన్నారు. అయితే నన్ను కూడా ఇష్టపడిన వారు, ప్రపోజ్ చేసిన వారు ఉన్నారు. అయితే కనెక్షన్ కుదర్లేదు. అలాంటి వాటిలో ఇండస్ట్రీలో నాకు చెడు అనుభవం లేదు. ఎవరో వచ్చి ఇష్టం, క్రష్ అని చెప్తే అది వారి ఫీలింగ్ మాత్రమే. ఆ ఫీలింగ్ నాలోనూ ఉంటేనే ఆ బంధం ముందుకు వెళ్తుంది’ అని కార్తీకదీపం సౌందర్య వెల్లడించారు.

Also Read: MEM FAMOUS REVIEW : “సుమంత్ ప్రభాస్” హీరోగా నటించిన మేమ్ ఫేమస్ ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like