ఈ ఫోటోని గమనించారా..? ఎక్కడో చూసినట్లు అనిపిస్తోందా.. సరిగ్గా పరిశీలించి చూస్తే ఆయన ఎవరో మీకు ఈ పాటికే అర్ధం అయిపోయి ఉంటుంది. ఆయన ఎవరో కాదు. టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మనకు ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు అనుకుంటా. ఎందుకంటే.. ఆయన కలం లోతు ఎంతో మనందరికీ ఇప్పటికే తెలుసు.

trivikram srinivas

ఆయన వదిలే మాటల తూటాలు ఎంత పదును గా మన గుండెలకు హత్తుకుంటాయో కూడా మరో సారి వివరించాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ ఫోటో ని చూస్తే అది పెళ్లి సమయం లో తీసిన ఫోటో అని అర్ధం అవుతూనే ఉంది కదా.. అంతే కాదు.. ఈ ఫోటో లో త్రివిక్రమ్ కొంచం లావు గా కూడా ఉన్నట్లు కనిపిస్తున్నారు.

trivikram srinivas 1

త్రివిక్రమ్ సౌజన్యను పెళ్లి చేసుకునే సమయానికి బాగానే లావుగా ఉన్నారు. త్రివిక్రమ్ కు సునీల్ అత్యంత సన్నిహితుడు. వీరిద్దరూ ఇండస్ట్రీ లో సెటిల్ కాకమునుపు ఒకే రూమ్ లో అద్దెకు ఉండి.. ఒకే బండి పై తిరిగేవారని ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. ఆ సమయం లో త్రివిక్రమ్ కాస్త బొద్దుగానే ఉండేవారు. అయితే.. క్రమం గా ఆయన ఫిట్ నెస్ పై శ్రద్ద పెట్టారు. త్రివిక్రమ్ ఇప్పటి ఫొటోలతో పోలిస్తే అప్పట్లో మాత్రం కొంచం లావు గానే ఉండేవారు.

trivikram srinivas 2

ఈ ఫోటో ను చూస్తున్న అభిమానులు త్రివిక్రమ్ అప్పటికీ..ఇప్పటికీ చాలా మారిపోయారని అంటున్నారు. వాస్తవానికి త్రివిక్రమ్ సౌజన్య అక్కను పెళ్లి చూపులలో చూడడానికి వెళ్ళాడట. కానీ.. సౌజన్య ను చూసి ఇష్టపడడం తో.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2002 లో వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు తో ఓ సినిమా, ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నారు. ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమా కు “అయినను పోయిరావలెను హస్తినకు” అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది.