చెమట చుట్టూ వుండే వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయా లేదా..?

చెమట చుట్టూ వుండే వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయా లేదా..?

by Megha Varna

Ads

మన శ్వాస, శరీరం నుంచి చెమట ఇలా వస్తూ ఉంటాయి కదా..? అవి చుట్టుపక్కల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయా…? మీకు కూడా ఎప్పుడైనా ఈ సందేహం వచ్చిందా..? అయితే మరి ఇప్పుడు చూసేయండి. శ్వాస తీసుకునేటప్పుడు, చెమట వలన కొన్ని రసాయనాలని పరిసరాల్లోకి విడుదల చేస్తూ ఉంటాం అని ఎప్పుడు స్టడీ చెప్పేసింది. కానీ చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా మన శరీరం ప్రభావితం చేస్తుందా..? ఈ విషయమే ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

శరీరం చుట్టూ ‘ఆక్సిడేషన్ ఫీల్డ్ వుంటుందట. అయితే ఇది మన చుట్టూ పరిసరాల్ని ఎఫెక్ట్ చేస్తుందని జర్మనీ లోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కెమిస్ట్రీ పరిశోధకులు, అమెరికా, డెన్మార్క్ శాస్త్రవేత్తలతో చేసిన అధ్యయనం ద్వారా తెలిసింది.

అలానే బయట వుండే రసాయాను కూడా మన మీద ఎఫెక్ట్ చూపుతాయి. పెయింట్లు, గ్యాస్ ఇటువంటివి అన్నీ కూడా మన మీద తెలీకుండానే ఎఫెక్ట్ చూపుతాయి. వాతావరణం లో కొన్ని నిర్వీర్యం అవుతాయి కానీ కొన్ని మాత్రం అలా ఉండిపోతాయి. యువి రేస్, వాటర్ వేపర్, ఓజోన్ కలిస్తే ఆక్సిడేషన్ అవుతాయి. ఆక్సిడేషన్ అయ్యినప్పుడు హైడ్రాక్సిల్ ర్యాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. పర్యావరణంలోని మిగిలిన రసాయనాలను తీసేందుకు ముఖ్య పాత్రని ఇవి పోషిస్తాయి. అట్మాస్ఫియర్ డిటర్జెంట్లు అని అందుకే అంటారు వీటిని. ఇంటిలోపల ఇవి క్లిష్టంగా మారుతాయి. ఆక్సిడేషన్ ఇంట్లో కూడా అవుతుంది. ఓజోన్ వల్ల ఆక్సిడేషన్ జరిగి.. అప్పుడు ఆయా కెమికల్స్ విచ్ఛిన్నం అవుతాయి.

మిగిలిన వాటిని మన శరీరం చుట్టు పక్కల వున్నా ఆక్సిడేషన్ ఫీల్డ్ నిర్వీర్యం చేస్తుందట. స్టడీ ఇదే విషయాన్ని చెబుతోంది. అలానే ఇవేమి కాకుండా మానవుల మూలంగానే హైడ్రాక్సిల్ ర్యాడికల్స్ ఉత్పత్తి చేస్తోందట. అన్ని జాగ్రత్తలు తీసుకుని బయటవి ఏమి కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఓజోన్‌ తో మానవ చర్మం చర్యలు జరిగి హైడ్రాక్సిల్ ర్యాడికల్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. మన స్కిన్ ద్వారా ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. దీనిలో కొన్ని కెమికల్స్ ఓజోన్ చర్యలు చేస్తోందట. స్కిన్ విడుదల చేసే నూనెలు తో ఓజోన్ రసాయన చర్యలు జరుపుతోంది. అప్పుడు ఓ గ్యాస్ లాగ కొన్ని అణువులు వచ్చాయి. చుట్టుపక్కల పర్యావరణంలో ఓజోన్‌ తో మళ్లీ ఇవి చర్యలు జరుపగా… ఓహెచ్ ర్యాడికల్స్ ఉత్పత్తి అయ్యాయి.


End of Article

You may also like