మనిషి చనిపోవడానికి “కుక్కలకు” నిజంగానే సంభందం ఉందా.?

మనిషి చనిపోవడానికి “కుక్కలకు” నిజంగానే సంభందం ఉందా.?

by Mohana Priya

Ads

కుక్క అరుపుకి, మనిషి చావుకి సంబంధం ఉంది అంటారు. అంటే ఒక వేళ కుక్క అరిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ఎవరైనా ఒక వ్యక్తి చనిపోబోతున్నారు అని ఆ కుక్క ముందే గ్రహించింది అని చెప్తూ ఉంటారు. ఇది ఎన్నో సంవత్సరాల నుండి మనదేశంలో నమ్మే ఒక విషయం. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందో మాత్రం ఎవరికీ తెలియదు. తెలిసినా కూడా ఆ విషయం పెద్దగా బయటకు రాలేదు. కానీ అసలు ఇందులో నిజం లేదు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.Does dogs can sense supernatural

Video Advertisement

అసలు ఈ విషయాన్ని నిరూపించటానికి పురాణాలకు సంబంధించిన, లేదా చరిత్రకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు. ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా ఈ విషయంపై పరిశోధనలు చేసి ఇది తప్పు అని నిరూపించడానికి ప్రయత్నించారు. కానీ ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అసలు కుక్కలకి అతీంద్రియ శక్తులు ఉన్నాయి అనే నమ్మకం గ్రీక్ నుండి వచ్చింది. కుక్కలు చావుని గ్రహించగలరు అనే నమ్మకం కుడా గ్రీకుల నుండే మొదలయ్యింది అని అంటారు. వారు ఈ నమ్మకాన్ని పెంచుకోవడానికి గల కారణం ఏంటో తెలియదు.Does dogs can sense supernatural

ఒక అమెరికన్ రచయిత ఏడు గిత్తలు ఉన్న కుక్కలకి దెయ్యాలు కనిపిస్తాయి అని ఒక పుస్తకంలో రాశారు.  కుక్క ఏదైనా శూన్యంలోకి చూసి అరుస్తూ ఉంటే అక్కడ దెయ్యం ఉండే ఉంటుంది అని, ఆ కుక్క రెండు చెవుల మధ్యలో నుండి చూస్తే మనకి కూడా కనిపిస్తుంది అని ఆ రచయిత రాశాడు. దీనిని కొంత మంది అలా ఏముండదు అని అంటే, కొంత మంది మాత్రం నమ్మారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం కుక్కలు దెయ్యాలని చూడటం లాంటివేమీ ఉండవు అని అంటున్నారు.Does dogs can sense supernatural

ఒక వేళ గాలిలో ఏదైనా రసాయనిక మార్పులు వస్తే, ఆ గాలి ఎవరైనా చావుకి దగ్గరగా, అంటే, అనారోగ్యంగా ఉన్న మనిషికి సోకితే, అదే గాలి కుక్కలకు తెలిసి, ఒకవేళ మనిషికి ఏదైనా ప్రమాదం ఉంటే గ్రహించగలుగుతాయి కానీ, చావుని పసిగట్టే శక్తి కుక్కలకి లేదు అని చెప్పారు. పైగా తెలియని వ్యక్తి చనిపోతే కుక్క ఏడుస్తుంది అనడం కూడా పొరపాటు అని అంటున్నారు. కుక్కలు ఏడవటానికి అనారోగ్యం కానీ లేదా ఇంక వేరే ఏదైనా కారణం కానీ ఉండొచ్చు అని అన్నారు.


End of Article

You may also like