కొన్ని రైల్వే స్టేషన్లలో జరిగే ఈ స్కాం లో ఈజీ గా ఇరుక్కుంటారు.. తెలుసుకుని జాగ్రత్తపడండి..!

కొన్ని రైల్వే స్టేషన్లలో జరిగే ఈ స్కాం లో ఈజీ గా ఇరుక్కుంటారు.. తెలుసుకుని జాగ్రత్తపడండి..!

by Megha Varna

Ads

మనకి తెలియకుండా స్కామ్స్ వంటివి జరుగుతూ ఉంటాయి. ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి అని తెలుసుకుంటే మనం వాటి వల్ల మోసపోకుండా జాగ్రత్త పడొచ్చు. అయితే ఈ రోజు చాలా మందికి తెలియని కొన్ని స్కామ్స్ గురించి చూద్దాం. ఇవి సాధారణంగా జరిగేవి కాదు. చూశారంటే నిజంగా ఎవరైనా సర్ప్రైజ్ అవుతారు.

Video Advertisement

జైపూర్ రైల్వే స్టేషన్ లో ఎంట్రెన్స్ వద్ద ఒక విచిత్రం జరుగుతూ ఉంటుంది. రైల్వే స్టేషన్ లోకి వెళ్ళిన తర్వాత ప్లాట్‌ఫామ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తే ఎరుపు రంగు బట్టలు వేసుకున్న కొంత మంది వ్యక్తులు మీ బ్యాగ్స్ ని అక్కడ మిషన్ లో పెట్టమంటారు. సాధారణంగా సెక్యూరిటీ గేట్ వద్ద ఉండే లగేజ్ ని స్కాన్ చేసే మిషన్ లాగే అది ఉంటుంది.

ఒకసారి మీరు మీ లగేజీని అందులో పెట్టిన తర్వాత పది రూపాయలని వాళ్ళు పే చెయ్యమంటారు. మిమ్మల్ని అడగకుండానే శానిటైజ్ చేస్తారు. కానీ రైల్వే స్టేషన్ లోనే దీనికి సంబందించిన పోస్టర్ వుంది. ఇదేమి తప్పనిసరి కాదు అని వుంది. అయితే చాలా మంది ఈ పోస్టర్ ని చూడకుండా వెళ్ళిపోతారు.

శానిటైజ్ చేసిన బ్యాగ్ ని మళ్ళీ అదే చేతులతో తాకడం వల్ల ఉపయోగం లేదు. కానీ వీళ్ళు పది రూపాయల తీసుకోవడం కోసం ఇలా చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా ప్రయాణికులు 10 బ్యాగులు తీసుకువస్తే 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వాళ్లు డబ్బుల్ని ప్రయాణికుల దగ్గర కాజేస్తున్నారు.


End of Article

You may also like