Ads
మనిషి మెదడు ఉన్నది ఆలోచించడానికి. ఒక్క రోజులో ఒక మనిషికి ఎన్నో ఆలోచనలు వస్తాయి. అలాగే ఒక మనిషికి ఎన్నో రకాల సందేహాలు కూడా వస్తుంటాయి. కల అనేది మనిషికి సహజంగా వచ్చే ఒక ఊహ. కలలో ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని మంచి కలలు వస్తే, కొన్ని భయంకరమైన కలలు వస్తాయి. అయితే “అంధులకి కలలు వస్తాయా?” అనే సందేహం మీలో కొంత మందికి వచ్చి ఉండొచ్చు.
Video Advertisement
అంధులకి కలలు వస్తాయి. అయితే కొంత మందికి పుట్టుకతో చూపు ఉండదు. కొంత మందికి కొన్ని సంవత్సరాలు చూపు ఉన్న తర్వాత పోతుంది. కొంత మందికి ఎన్నో సంవత్సరాలు చూపు ఉన్న తర్వాత, వారి చూపుని కోల్పోతారు. కొన్ని సంవత్సరాలు చూపు ఉండి తర్వాత కోల్పోయిన వారికి వచ్చే కలలో పిక్చర్ స్పష్టంగా కనిపించదు.
అయితే వారికి వినికిడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలా విన్న దాన్ని బట్టి, ముట్టుకున్న దాన్ని బట్టి వారు ఇమాజిన్ చేసుకోగలుగుతారు. ఎక్కువ సంవత్సరాలు చూపు ఉండి తర్వాత చూపు కోల్పోయిన వారికి వచ్చే కలలు మామూలుగా ఉంటాయి. పుట్టుక నుండి చూపు లేని వారికి కలలు వస్తాయి.
కానీ అవి కనిపించడం కష్టం. కలలు అనేవి కేవలం చూపు ద్వారానే కాకుండా, ఆలోచనల ద్వారా, అలాగే మెదడు పని చేసే దాన్ని బట్టి కూడా వస్తాయి. కాబట్టి స్పర్శ, వాసన, ఆలోచనల ద్వారా వారికి కలలు వస్తాయి. అందుకే వీరికి వచ్చే కలల్లో ఒకవేళ రూపం కనిపించినా కూడా అది మామూలు రూపం కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది.
End of Article