నీళ్లకు ఎక్స్ పైరీ ఉంటుందా? మరి వాటర్ బాటిల్ మీద ఆ డేట్ ఎందుకు?

నీళ్లకు ఎక్స్ పైరీ ఉంటుందా? మరి వాటర్ బాటిల్ మీద ఆ డేట్ ఎందుకు?

by Sunku Sravan

Ads

షార్ట్ టెర్మో, లాంగ్ టెర్మో మార్కెట్ లో అమ్మే ప్రతి వస్తువుకు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉటుంది. కానీ కొన్ని వస్తువులకు ఈ ఎక్స్ పైరీడేట్ అనేది అవసరం లేకున్నా ప్రింట్ చేస్తారు. మనం నిత్యం వాడే వాటర్ బాటిల్ విషయంలో కూడా అదే జరుగుతుందని తెలుసా?

Video Advertisement

వాస్తవానికి నీళ్లకు రంగు రుచి అనే స్వభావం ఉండదు. ఒకవేళ ఎక్కడైనా నీళ్లు రంగు రుచి అనే స్వభావాన్ని కలిగి ఉన్నాయంటే దానర్థం అవి తాగడానికి పనికిరాని నీరని అర్థం. నీరు ఎప్పుడు చెడిపోదు నీటికి రంగు రుచితో పాటు ఎక్స్ పైరీ కూడా ఉండదు. కానీ మార్కెట్ లో దొరికే వాటర్ బాటిల్స్ మీద సాధారణంగా తయారీ తేదీ నుంచి 2 సంవత్సరాల గడువు తేదీ రాస్తారు. ఈ గడువులోపే వాటర్ ను ఉపయోగించాలి.

మార్కెట్ లో మనం తీసుకునే వాటర్ బాటిల్ మీద ఎక్స్ పైరీ డేట్ తో పాటు ‘Crush the bottle after use’ ఐ రాసి ఉంటుంది. ఐనా దానిని మనం ఎవ్వరం పెద్దగా లెక్కచేయం. ఆ బాటిల్స్ ని ఇంటికి తీసుకువచ్చి వాడుతుంటాం. అలా చేయడం వళ్ళ కొంతకాలానికి ప్లాస్టిక్ కరగడం మొదలై నీటిలో కలిసిపోతుంది. ఆ నీటిని మనం తాగినప్పుడు ఆ ప్లాస్టిక్ మన శరీరం లోకి పోయి అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లలో BPA అనే​రసాయనం ఉంటుంది. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. తద్వారా ఈ BPA రక్తపోటు , టైప్-2 మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఇక్కడ ఎక్స్ పైరీ అనేది తాగే వాటర్ కి కాదు. అది ఉన్న బాటిల్ కి. ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలైనా, వాటర్ ఐనా మనం తినడం, తాగడం అనేది ఆరోగ్యానికి హానికరం. అత్యవసర పరిస్థితిల్లో తప్ప ప్లాస్టిక్ వాడకాని ప్రోత్సహించకూడదు.


End of Article

You may also like