Ads
కరోనా వైరస్ వల్ల ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైంది. అయితే వైరస్ ని తరిమేయడానికి చాలా కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుగొన్నారు. దీనిపై సమాజంలో ఎన్నో అపోహలు తలెత్తాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆపడానికి ప్రయత్నించే వారు మరియు తెలిసీ తెలియక ఒక వార్తను అందరికీ తెలిసేలా చేశారు. దానివల్ల మహిళలందరూ తప్పుగా ఆలోచించారు.
Video Advertisement
కరోనాకు సంబంధించి వ్యాక్సిన్ ను తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ప్రెగ్నెంట్ అవ్వడానికి లేక మిస్ క్యారేజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించారు.
దానివల్ల చాలా మంది మహిళలు వ్యాక్సిన్లు వేసుకోడానికి ముందుకు రాలేదు. అయితే నిజానికి దీనికి సంబంధించిన సరైన ఆధారాలు లేవు. అసలు ఈ సంఘటనకు సంబంధించి అపోహ ఎలా వచ్చింది..? వ్యాక్సిన్ ను కనుగొన్న కొత్తల్లో విదేశాల్లో ట్రయల్స్ నిర్వహించారు. ఆ సమయంలో కొంతమంది ఈ సమాచారాన్ని ఎంతో సీరియస్ గా తీసుకున్నారు.
అదేంటంటే ప్లసెంటలో ఉండే ప్రోటీన్స్ కు మరియు వైరస్ లో ఉండే ప్రోటీన్స్ ఒకే విధంగా ఉంటాయి. దానివల్ల వైరస్ లో ఉండే యాంటీ బాడీస్ ఈ రెండిటిలో ఉండేటువంటి ప్రోటీన్స్ ను బ్లాక్ చేస్తాయని అనుకున్నారు. అయితే వైరస్ లో ఉండే ప్రోటీన్స్ మరియు ప్లసెంటలో ప్రోటీన్స్ ఒకటికావని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి.
దీనికి సంబంధించి పరిశోధనలు చేసి అది తప్పుడు సమాచారం అని తెలియజేయడం కూడా జరిగింది. ఈ విధంగా క్లారిటీ ఇచ్చిన తర్వాత గర్భిణులు కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకొచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్నా లేక తీసుకోకపోయినా ఫెర్టిలిటీకు సంబంధించి మహిళల్లో ఎటువంటి తేడా రాలేదు.
అంతేకాదు మగవారిలో కూడా ఎటువంటి సమస్యలు రావు. ఎలా అయితే చిన్నవయసులో కొన్ని వ్యాధులకు సంబంధించి వ్యాక్సినేషన్ ఇస్తారో అదేవిధంగా మన శరీరం రెస్పాండ్ అవుతుంది. అంతేగాని వ్యాక్సినేషన్ కు మరియు ఇన్ఫెర్టిలిటీకు ఎటువంటి సంబంధం లేదు.
End of Article