మీ మెడ భాగంలో నల్లగా అవుతుందా.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే అంతా మాయం..!!

మీ మెడ భాగంలో నల్లగా అవుతుందా.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే అంతా మాయం..!!

by Sunku Sravan

మానవ శరీరంలో ఏ పార్ట్ అయినా సరే శుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది ముఖంపై పెట్టిన శ్రద్ధ శరీరంలోని ఇతర భాగాలపై చూపరు. ముఖ్యంగా మెడ భాగంలో నల్లగా అపరిశుభ్రంగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే ముఖం అందంగా ఉంచుకొని మేడను మర్చిపోయి ఆ భాగాన్ని శుభ్రంగా ఉంచుకోవడంలో అలసత్వం వహిస్తారు. అయితే మీ మెడ భాగం అందంగా కనిపించాలంటే ఇంటి చిట్కాలతో అద్భుతమైన ఫలితాలు.. ఏంటో చూడండి..?#1 రోజ్ వాటర్ ఆరెంజ్ తొక్క

Video Advertisement

ఒక కప్పులో సగం స్పూన్ ఆరెంజ్ తొక్క పౌడర్ మరియు ఒక టీస్పూన్ రోజ్ వాటర్ ను తీసుకొని బాగా కలిపి ఆ పదార్థాన్ని మెడపై మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో మెడభాగంలో నిగారింపు పెరుగుతుంది.#2 గ్రీన్ టీ ప్యాక్ బాదం

నూనె ఒక కప్పులో ఒక టీస్పూన్ గ్రీన్ టీ, మరో టీ స్పూన్ బాదం నూనె వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకోవాలి. అలా ఒక 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని చూసుకుంటే మన మెడ భాగంలో మంచి రిజల్ట్ కనబడుతుంది.#3 తేనే బియ్యంపిండి
రెండు టీ స్పూన్ల తేనె ఒక టీస్పూన్ బియ్యంపిండి కప్పులో వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని మెడకు రాసుకునీ కొద్దిసేపు ఆరనివ్వాలి.20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మెడను శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మెడ భాగంలో చర్మం శుభ్రంగా ఈ నలుపు తగ్గుతుంది.#4నిమ్మరసం
ఈ నిమ్మ రసానికి కొద్దిగా నీళ్లు జోడించి దాన్ని మన మెడపై రాసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మెడ భాగం అందంగా తయారవుతుంది.

 


You may also like