చాణక్య నీతి: జీవితంలో ఈ 2 తప్పులని అస్సలు చెయ్యద్దు…కృషి కూడా వృథా అవుతుంది..!

చాణక్య నీతి: జీవితంలో ఈ 2 తప్పులని అస్సలు చెయ్యద్దు…కృషి కూడా వృథా అవుతుంది..!

by Megha Varna

Ads

ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా మనకి ఎన్నో విషయాలని చెప్పారు. నిజానికి వాటిని మనం ఆచరిస్తే జీవితం ఎంతో బాగుంటుంది. చాణక్యుడు ఎంతటి మహా జ్ఞానో మనకు తెలిసిందే. నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు ఇలా ఎన్నో చాణక్య చెప్పారు. వీటిని మనం అను దినం ఆచరిస్తూ ఉంటే మన జీవితాన్ని చూసుకోక్కర్లేదు.

Video Advertisement

సమస్యలేమీ లేకుండా ఏ బాధ లేకుండా ఉండచ్చు. ఎంచక్కా జీవితంలో ముందుకు వెళ్ళిపోవచ్చు. అలానే చాణక్య మనిషి జీవితంలో వీటిని పోగొట్టుకుంటే కృషి వృధా అయినట్లే అని చెప్పారు. మనిషి జీవితం లో కనుక వీటిని పోగొట్టుకుంటే వారి జీవితం ఇక వృధానే.

#1. జీవిత భాగస్వామి విషయంలో ఈ తప్పు:

జీవితంలో చక్కటి జీవిత భాగస్వామి ఉంటే వారి జీవితం ఎంతో బాగుంటుంది. నిజానికి ప్రతీ ఒకరు కూడా ఎంతో న‌మ్మ‌కంగా జీవిత భాగస్వామి తో ఉండాలి. భార్య కానీ భర్త కానీ మరొకరితో సంబంధం కలిగి వుండకూడదు. ఒకవేళ కనుక ఇలాంటి తప్పు చేస్తే.. ఆ మచ్చ ఎప్పటికీ అలానే ఉండి పోతుంది తప్ప అది పోదు. గుర్తుంచుకోండి. ఒకవేళ కనుక ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటే కృషి వృధా అయినట్లే. పైగా ఇలా ఒకసారి జరిగాక మళ్ళీ జీవిత భాగస్వామి తో ఆనందంగా ఉండేందుకు కుదరదు. సో జీవిత భాగస్వామి విషయంలో ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోండి. చాణక్య కూడా ఇదే అంటున్నారు.

chanakya about life

#2. అంత‌రాత్మ‌కు విరుద్ధంగా ఉండద్దు:

ఎప్పుడు కూడా ఎవరైనా సరే అంత‌రాత్మ‌కు విరుద్ధంగా ఉండకూడదని చాణక్య నీతి ద్వారా ఆచార్య చాణక్య అంటున్నారు. ఒకవేళ ఇలా చేస్తే వారి గౌరవం తో పాటుగా కుటుంబం గౌరవం కూడా పోతుంది. పైగా ఆ మచ్చ జీవితాంతం ఉంటుంది. ఎప్పటికీ కూడా అది పోదు. కాబట్టి అంత‌రాత్మ‌కు విరుద్ధంగా ఉండద్దు. ఎప్పుడు కూడా మంచి పనులని, మంచి అనిపించే వాటిని చెయ్యాలి తప్ప. జీవితాన్ని ప్రమాదంలో పడేసే వాటిని అనుసరించకూడదు.

 


End of Article

You may also like