శ్రీ‌కాళ‌హ‌స్తి గుడి ద‌ర్శ‌నం తర్వాత నేరుగా ఇంటికే రావాలని ఎందుకు అంటారో తెలుసా.?

శ్రీ‌కాళ‌హ‌స్తి గుడి ద‌ర్శ‌నం తర్వాత నేరుగా ఇంటికే రావాలని ఎందుకు అంటారో తెలుసా.?

by Harika

Ads

తిరుమలకి ఒక్క రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మాత్రమే కాకుండా భారత దేశంలోని వివిధ ప్రాంతాల నుండి, అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదేశాల నుండి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. తిరుమలని సందర్శించిన తర్వాత చాలా మంది భక్తులు చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలకి కూడా వెళ్తారు. శ్రీనివాస మంగాపురం, గోవిందరాజ స్వామి గుడి, అలివేలు మంగాపురం, పాపనాశనం, తర్వాత కాణిపాకం, తర్వాత శ్రీకాళహస్తిని దర్శించుకుంటారు.

Video Advertisement

అయితే, శ్రీకాళహస్తి దర్శించుకున్న తరువాత మరే గుడికి వెళ్ళకూడదు అని అంటారు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే. పంచభూతాలకి ప్రతీకగా పంచభూత లింగాలు వెలిశాయి. శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో వెలసిన వాయులింగం అందులో ఒకటి.  అందుకే ఇక్కడి గాలి స్పర్శించిన తరువాత ఏ ఇతర దేవాలయాలకు వెళ్లకూడదనేదే ఈ ఆచారం. శ్రీకాళహస్తి సందర్శించుకున్న తరువాత రాహు కేతువుల దోషం ఉంటే తొలగుతుంది.

శ్రీకాళహస్తి క్షేత్రంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సందర్శించుకుంటే, సర్ప దోషం తొలగుతుంది. దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలని వదిలేసి వెళ్ళాలి. తర్వాత వేరే ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా దోషనివారణ జరగదు అని చెప్తారు. అందుకే ప్రత్యేక పూజలు చేయించిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళాలి అని అంటారు. ఒక్క పరమశివుడిపై తప్ప మిగిలిన అందరి దేవుళ్ళపై శని ప్రభావం, గ్రహ ప్రభావం ఉంటుంది.

చంద్ర గ్రహణం సమయంలో అన్ని దేవాలయాలని మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ చేసి తర్వాత పూజలు ప్రారంభిస్తారు. కానీ శ్రీకాళహస్తిలో మాత్రం గ్రహణ సమయంలో కూడా ఆలయం తెరిచే ఉంటుంది. అంతే కాకుండా రోజంతా ప్రత్యేక పూజలు జరుగుతాయి. అందుకే శ్రీకాళహస్తి దర్శించిన తర్వాత వేరే దేవాలయాన్ని దర్శించకూడదు అని చెప్తారు.


End of Article

You may also like