Ads
మామూలుగా మనం అన్నం తినేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తింటారు. అందులో కొంతమంది నీరు పక్కన లేకుంటే అన్నం అసలు తినలేరు.
Video Advertisement
కొంతమంది అన్నం పూర్తయ్యాక మాత్రమే నీరు తాగుతారు. మరి అన్నం తిన్న వెంటనే నీరు తాగవచ్చా.. లేదా అన్నది ఒకసారి చూడండి..!మన హెల్దీగా ఉండాలంటే నీరు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతిరోజు 10 నుంచి 12 గ్లాసుల నీటిని తాగితే ఆరోగ్యంగా ఉంటాం..
కానీ కొంతమంది తాగాల్సిన టైంలో కాకుండా మిగతా టైం లో నీరు తాగుతూ ఉంటారని దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు.. తిన్న వెంటనే నీరు తాగొచ్చా.. ఏంటో ఒక సారి చూద్దాం..!!
అయితే తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు అని వైద్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే జీర్ణక్రియ నిర్వహణ అనేది అప్పుడే ప్రారంభం అవుతుంది. మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి రెండు గంటల సమయం పడుతుంది.. ఈ క్రమంలో నీరు తాగితే జీర్ణక్రియ వేడి తగ్గుతుంది. దీని వల్ల అది జీర్ణ వ్యవస్థ పై ప్రభావితం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నీళ్లు తాగడం వల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు..
మరి నీరు ఎప్పుడు తాగాలి..?
వ్యక్తి తిన్న తర్వాత ఒక గంట విరామం తీసుకొని నీరు తాగితే అతని బరువును నియంత్రించ వచ్చు.అలాగే ఉదయం లేవగానే రెండు గ్లాసుల నీటిని తాగితే జీర్ణ వ్యవస్థ బలంగా తయారవుతుంది.
తిన్న గంట తర్వాత నీరు తాగితే గ్యాస్ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
అలాగే భోజనానికి 30 నిమిషాల ముందు నీరు తాగడం చాలా మంచిది.
End of Article