“క్యాష్” షో చూసినప్పుడల్లా “లాస్” రాదా అని డౌట్ వస్తుంది.? అసలు కథ ఏంటో చూడండి.!

“క్యాష్” షో చూసినప్పుడల్లా “లాస్” రాదా అని డౌట్ వస్తుంది.? అసలు కథ ఏంటో చూడండి.!

by Anudeep

Ads

మనం ఈటీవీ లో ప్రసారం అయ్యే “క్యాష్” (దొరికినంత దోచుకో) ప్రోగ్రాం ను చూస్తుంటాం కదా..ఈ షో లో నాలుగు రౌండ్ లు ఉంటాయి. ప్రతి రౌండ్ లో విన్నర్ కి కొంత క్యాష్ ప్రైజ్ ఉంటుంది. అలానే, లాస్ట్ రౌండ్ పకడో పకడో రౌండ్.. ఈ రౌండ్ లో విన్నర్ అయితే వారికి ఫైనల్ అమౌంట్ తో పాటు ఆ వస్తువులను కూడా ఇచ్చేస్తారు.

Video Advertisement

ఒకవేళ కంటెస్టెంట్ ఆన్సర్ చేయలేకపోతే ఆ వస్తువులన్నీ కింద పడిపోతూ ఉంటాయి. అయితే చాలా మందికి ఈ విషయం లో డౌట్ వుంది. ఈ వస్తువులను నిజం గానే పడేస్తారా? అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అంతేకాదు ఆ గెలుచుకున్న డబ్బు మొత్తం కంటెస్టెంట్స్ కి ఇస్తారా అనే డౌట్ కూడా వచ్చే ఉంటది.? ఆ డౌట్ ని ఇప్ప్పుడు మనం క్లియర్ చేసేసుకుందాం.

cash

క్యాష్ షో ను జులై 2009 లో స్టార్ట్ చేసారు.  ఈ షూటింగ్స్ అన్ని రామోజీ ఫిలిం సిటీ లోనే జరుగుతాయి. మంత్ కి సరిపడా షూటింగ్స్ ను ఒక్కరోజు లోనే షూట్ చేసేస్తారు. ఏదైనా మూవీ రిలీజ్ అవ్వబోతున్న టీం ని కానీ, లేదా ట్రేండింగ్ లో ఉన్న సెలబ్రిటీస్ ని కానీ కాల్ చేసి ఈ షో కి పిలుస్తారు. షో స్టార్టింగ్ లో వాళ్ల ఇంట్రో డాన్స్ లు ఉంటాయి. వాటికి ముందు రిహార్సల్ మేక్ అప్ లు ఉంటాయి.

cash 1

ఈ షో లో కంటెస్టెంట్స్ కి రెమ్యునరేషన్ లు ఇస్తారు. ఈ షో కి వచ్చే కంటెస్టెంట్ ని బట్టి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. పెద్ద స్టార్ అయితే ఎక్కువ మొత్తం లో రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తారు. అదే చిన్న స్టార్ లకు సాధారణ మొత్తం లో ప్రైజ్ మనీ ఆఫర్ చేస్తారు. అయితే లాస్ట్ రౌండ్ లో చూపించే ప్రైజ్ మనీ గేమ్ వరకే పరిమితం అవుతుంది. కంటెస్టెంట్ లు అందరికి రెమ్యునరేషన్లు మాత్రమే ఇస్తారు. అలాగే… పకడో పకడో రౌండ్ లో వస్తువులన్నీ మూవ్ అవుతూ ఉంటాయి కదా. అవి అన్ని కిందపడేస్తారు.

cash 2

కానీ ప్రతి సారీ అంతంత డబ్బు పెట్టి కొని ఎలా పడేస్తారు..? అని మనకి అనిపిస్తుంది. వాళ్ళు వాటిని నిజం గానే పడేస్తారు. కానీ, అవన్నీ లోకల్ ప్రొడక్ట్స్. మనకి చూపించిన బ్రాండెడ్ ప్రొడక్ట్స్ పడేసిన వాటిల్లో ఉండకపోవచ్చు. షో టైం లో తక్కువ హైట్ నుంచి పడేసి.. ఆ తరువాత లోకల్ ప్రొడక్ట్స్ ను తక్కువ కాస్ట్ లో దొరికే వాటిని పై నుంచి పడేస్తూ షూట్ చేస్తారు. అయితే, ఇలా ఎందుకు చేస్తారు అంటే.. వాళ్ళకి ఇందుకోసం అయ్యే ఖర్చు వాళ్ళకొచ్చే లాభం తో పోలిస్తే చాలా తక్కువ. వాళ్ళకి ప్రాఫిట్ వస్తున్నపుడు ఇలాంటి పని చేయడానికి ఏమి ఆలోచించరు. వందరూపాయలు వస్తున్నపుడు రూపాయి ఖర్చు చేయడానికి ఎవరు ఆలోచించరు కదా.. ఇది కూడా అలాంటిదే.


End of Article

You may also like